#కస్తూరిబా పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మార్వో ముప్పు కృష్ణ.
నల్లబెల్లి, నేటి ధాత్రి: విద్యార్థినులకు నాణ్యమైన రుచికరమైన మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని ఎమ్మార్వో ముప్పు కృష్ణ అన్నారు మండల కేంద్రంలోని కస్తూరిబా గురుకుల పాఠశాలను శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా పాఠశాలలోని పలు రిజిస్టర్ లను, వంట సామాగ్రిని పరిశీలించారు అలాగే పిల్లలకు వండిన వంటలను రుచికరంగా ఉన్నాయా లేదా అడిగి తెలుసుకుని వారితో కలిసి భోజనం చేశారు అదేవిధంగా పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని చలి తీవ్రత ఎక్కువ ఉండడంతో విద్యార్థులకు వేడి నీటిని సరఫరా చేయాలని విద్యార్థులకు కల్పించే అన్ని సదుపాయాలు యధావిధిగా అందించాలని పాఠశాల ప్రత్యేక అధికారికి సూచన చేశారు ఈ కార్యక్రమంలో ఆర్ ఐ రాజేంద్రప్రసాద్, స్పెషల్ ఆఫీసర్ సునీత, ఉపాధ్యాయ బృందం, పాఠశాల సిబ్బంది తదితరులు ఉన్నారు.