ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య…
విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించండి..
ప్రధానోపాధ్యాయులు బీరం జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో బడిబాట…
కేసముద్రం నేటి ధాత్రి:
విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని బేరువాడ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బీరం జనార్దన్ రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం బేరువాడ గ్రామంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బీరం జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విధంగా, ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతు న్న ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ, నాణ్యమైన మధ్యాహ్న భోజనం,ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ , రాగి జావా,రెండు జతల బట్టలు ఇస్తూ నిష్ణాతులైన ఉపాధ్యాయులచే ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన జరుగుతుందని వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, ప్రైవేటు పాఠశాలలో చేర్పించి ఆర్థికంగా నష్టపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బానోతు వాగ్య, కోడం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పనికి ఆహారపథకంలో పాల్గొంటున్న విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి వారిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బీరం జనార్దన్ రెడ్డి కోరారు.