ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ద్వితీయ వార్షికోత్సవం
పిఆర్టియు జిల్లా శాఖ అధ్యక్షులు మందల తిరుపతిరెడ్డి
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ద్వితీయ వార్షికోత్సవం పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఆర్టియు హనుమకొండ జిల్లా శాఖ అధ్యక్షులు మందల తిరుపతిరెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి పలిత శ్రీహరి,చర్లపల్లి గ్రామ మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి, శ్రీ సాయి ట్రస్ట్ అధ్యక్షులు వేముల ప్రభావతి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మందల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు, జిల్లా ప్రధాన కార్యదర్శి పలిత శ్రీహరి మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని అన్నారు,మాజీ చాడ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ చర్లపల్లి ప్రాథమిక పాఠశాలకు మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా అన్ని వసతులు కల్పించబడి ప్రైవేట్ పాఠశాలకు దీటుగా రూపొందించబడిందని, తల్లిదండ్రులు అందరూ ప్రైవేట్ పాఠశాలలకు పంపించకుండ మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని అన్నారు. వేముల ప్రభావతి మాట్లాడుతూ శ్రీ సాయి ట్రస్ట్ ద్వారా చర్లపల్లి పాఠశాలకు మా వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని అన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయ అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన అతిధులు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులను ఉపాధ్యాయులను, గ్రామ ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కందికట్ల రమ,పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా,కంచ రాజు కుమార్, మేకల సత్యపాల్, పోలంపల్లి విజేందర్,నిగ్గుల శ్రీదేవి, అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మీ,నందిపాటి సంధ్య,రమేష్,ఆయాలు సరోజన,రమ,సుశీల,అరుణ, విద్యార్థిని,విద్యార్థుల తల్లిదండ్రులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.