ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

_ చందుర్తి మండల ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో గత కొంతకాలంగా నీటి ఎద్దడిని ప్రధానోపాధ్యాయుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ మండల దృష్టికి తీసుకురాగా మండల అధ్యక్షురాలు మరియు ప్రజాప్రతినిధులు స్పందించి బోర్ వెల్ వేయించి ఈరోజు స్వయంగా నీటి సరఫరా ప్రారంభించడంతో ప్రాథమిక పాఠశాల చందుర్తి లో నీటి ఎద్దడి కి పరిష్కారం జరిగింది.
ఈ సందర్భంగా మండల అధ్యక్షురాలు బైరగోని లావణ్య రమేష్ మాట్లాడుతూ ” పిల్లల ప్రగతికి ప్రభుత్వ పాఠశాలలే పట్టుకొమ్మలని, పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి, నాణ్యమైన విద్యతో పాటు సౌకర్యాలను పొందాలని, మన ఊరు మనబడి కార్యక్రమం కింద ఎంపిక కాబడిన పాఠశాలలను అందంగా ,ఆకర్షణీయంగా తీర్చిదిద్దడమే కాకుండా సకల సౌకర్యాలు కల్పించడం జరిగిందని ,తొలిమెట్టు అనే వినూత్న బోధన కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల్లో పకడ్బందీగా అమలవుతుందని, దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం, చతుర్విధ ప్రక్రియలు, ఇతర అంశాల్లో అద్భుత ప్రగతిని ప్రభుత్వ పాఠశాలలో సాధిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలు కార్పోరేట్ స్థాయి విద్యను అందిస్తున్నాయని, ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు, బలోపేతానికి కృషి చేయాలని “పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ నెంబర్ బత్తుల కమలాకర్, గ్రామ ఎంపీటీసీ పులి రేణుక సత్యం ,మార్కెట్ కమిటీ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, నాయకులు భైరగోని రమేష్ ,ప్రధానోపాధ్యాయుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ , విద్యార్థినీ,విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *