జహీరాబాద్ 108 అంబులెన్స్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన క్వాలిటీ ఆడిటర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో సాయంత్రం 108 అంబులెన్స్ ను ఈఎంఆర్ఎ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ క్వాలిటీ ఆడిటర్ ఫకీర్ దాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనంలోని వైద్య పరికరాల పనితీరు, స్టాక్, రికార్డుల నిర్వహణ, సేవల నాణ్యతా ప్రమాణాలను ఆయన పరిశీలించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ బోయిని సంపత్, సంగారెడ్డి జిల్లా 108 కోఆర్డినేటర్ శాలి హుస్సేన్, 102 కోఆర్డినేటర్ కిరణ్, 108 సిబ్బంది EMT పండరి, PILOT శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
