నివాళులు అర్పించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
పరకాల నేటిధాత్రి
పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పట్టణ అధ్యక్షులు కొయ్యడా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పి.వి నరసింహారావు చిత్రపటానికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పూలమాలవేసి ఘన నివాలి అర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దిన మహానుభావుడు,ఎన్నోసార్లు కొత్త కొత్త పద్ధతులను అవలంబిస్తూ దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచిన మహానుభావుడు,అన్ని భాషలు మాట్లాడగల కోవిదుడు మన దేశ ఆర్ధిక పరిస్థితి ఇప్పుడు ఇలా ఉంది అంటే ఆ మహానుభావుడు ప్రవేశపెట్టిన ఆర్ధిక విధానాలే కారణం,17 భాషల్లో ప్రావీణ్యం ఉన్నా మాతృభాష తెలుగు అభివృద్ధికి ఎంతగానో కృషిచేశారు,అలాంటి మహానుభావుడు తెలుగుజాతి ముద్దుబిడ్డ కావడం మనకేంతో గర్వకారణం అని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి,పట్టణ ఉపాధ్యక్షులు ఒంటేరు శ్రవణ్,ఎంపీటీసీ మల్లారెడ్డి,మాజీ ఎంపీటీసీ రవి,బ్లాక్ కాంగ్రెస్ వీర్ల చిన్ని,సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం శివకుమార్, సీనియర్ నాయకులు కొలుగురి రాజేశ్వరరావు,చిన్నాల గొనాధ్,దాసరి భిక్షపతి నేత,చిట్టిరెడ్డి వెంకట్ రెడ్డి,ఆముదాలపెళ్లి క్రాంతి,దుబాసి వెంకటస్వామి,లక్కం శంకర్,మెరుగు శ్రీనివాస్,గుడెల్లి సధన్,రజినీకాంత్, చిర్ర రాజన్న,రాజేష్,మోహన్ తదితరులు పాల్గొన్నారు.