దేశం గర్వించదగ్గ మహనీయుడు పీవీ నర్సింహారావు.

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.

ఘనంగా మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు

నర్సంపేట,నేటిధాత్రి:

దివంగత నేత, స్థిత ప్రజ్ఞుడు, బహుభాషాకోవిధుడు, నూతన ఆర్థిక విధానాల రూపశిల్పి దేశం గర్వించదగ్గ మహనీయుడు పూర్వ ప్రధాని స్వర్గీయ పి.వి నరసింహారావు అని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.పీవీ నర్సింహారావు 20 వ వర్ధంతి వేడుకలు వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో గల పీవీ నర్సింహారావు స్మారక మందిరంలో ఘనంగా నిర్వహించారు.
సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను స్మరిస్తూ పెద్ది సుదర్శన్ రెడ్డి పి.వి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పీవీ నర్సంపేట నియోజకవర్గం లక్నేపెల్లి గ్రామంలో పుట్టిన బిడ్డగా భారత దేశాన్ని పరిపాలించడంతో పాటూ మన ప్రాంతాన్ని దేశ స్థాయిలో పరిచయం చేసిన ఆయన కీర్తి ఎప్పటికీ చిరస్మరణీయమన్నారు.దొర కుటుంబంలో పుట్టిన మాజీ ప్రధాని పీవీ తన వారసత్వ భూములను పంపిణీ చేశారని అలాగే పేదల కోసం దొరలవద్ద ఉన్న వేలాది ఎకరాల భూములను సీలింగ్ యాక్ట్ చేసి దళితులు,గిరిజనులు పేదలకు పంచిన వ్యక్తి అని నేడు మన ప్రాంతంలో అసైన్డ్ భూములుగా పేద ప్రజలు సాగుచేసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వివరించారు.ఎలాంటి వనరులు లేని సమయంలో దేశంలో తనదైన ఆర్థిక సంస్కరణలతో జాతి ఉన్నతికి బాటలు వేసిన తీరు, రాజకీయాల్లో ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆయన తత్వం,పాత్రికేయం,సాహిత్య పరిజ్ఞానం ఇలా భిన్న రంగాలపై తనదైన ముద్రవేసిన పీవీ నరసింహారావు జీవితం, వారు చూపిన తెగువ.. నేటి తెలంగాణ యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
పీవీ నర్సింహారావు వంద సంవత్సరాల పండుగా సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేయగా అధికారకంగా చేసే లక్నేపల్లి స్మారక మందిరంలో వేడుకలు చేశామని చెప్పారు.దేశంలో అవినీతి ఆరోపణలు లేని వ్యక్తి,శత్రు పార్టీల నుండి కూడా మన్ననలు పొందారని అన్నారు.పీవీ నర్సింహారావు పుట్టిన నుండి చావుదాక ఒక రాజకీయ పార్టీలో కొనసాగిన ఎన్నో అవమానాలకు గురై చిట్టచివరి జీవితం ముగించిందో ఆవేదనతో పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.హైకోర్టు అడ్వకేట్ అక్షయ్ బాబు మాట్లాడుతూ
నేడు నిత్యం వాడకంలో ఉన్న సెల్ ఫోన్,టివి కారణం పీవీ
ఆయన చేసిన సంస్కరణలు అని పేర్కొన్నారు.ఆయన జ్ఞాపకాలు,పనులు మరిచిపోకూడదని యువతను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో పీవీ కుటుంబ సభ్యులు,ట్రస్ట్ నిర్వాహకులు
రవీందర్ శర్మ, బిఆర్ఎస్
మండల పార్టీ అధ్యక్షులు నామాల సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నరసింహరాములు,క్లస్టర్ బాధ్యులు మోతే పద్మనాభరెడ్డి, కోమండ్ల గోపాల్ రెడ్డి,నియోజకవర్గ నాయకుడు న్యాయవాది మోటూరి రవి,మాజీ సర్పంచ్ గోడిశాల రాంబాబు గౌడ్,గ్రామ పార్టీ అధ్యక్షుడు సున్నపు కొమ్మాలు,మాజీ ఎంపీటీసీ పిండి నరేందర్,మాజీ ఉమ సర్పంచ్ సంతోష్,అశోక్,బగ్గి రాజు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!