జిహెచ్ఎంసి ఉప్పల్ సర్కిల్
ఉప్పల్ నేటిధాత్రి మే30:
జిహెచ్ఎంసి ఉప్పల్ సర్కిల్ పరిధిలో ఇంటి నిర్మాణ వ్యర్ధాలు బాధ్యత రహితంగా ఎక్కడపడితే అక్కడ ఇంటి యజమానులు పడవేస్తున్నందున జి.హెచ్.ఎం.సి ఉప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు ఇంటి యజమానులకు మరియు ఇంటి వ్యర్ధాలు పడవేసే వాహనదారులకు అవగాహన కల్పించుటకు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి అచ్చట సీ.సీ కెమెరాలు ఏర్పాటు చేసినారు . ముఖ్యంగా ఈ యొక్క ఫ్లెక్సీ బోర్డులను దేవేందర్ నగర్ రోడ్డు నుండి రామంతపూర్ అలీ కేఫ్ నాలా రోడ్డు ప్రక్కల డెమోలిషన్ అండ్ కన్స్ట్రక్షన్ వేస్ట్ వేయుటకు అవకాశం ఉన్న స్థలాలలో ఏర్పాటు చేసినారు. మరియు ఇట్టి విషయంపై ఈ ప్రాంతంలో జి.హెచ్.ఎం.సి ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి 24 గంటలు నిఘా ఏర్పాటు చేసినారు వీరు వారి దృష్టిలోకి వచ్చిన ఎవరైనా వాహనదారు నిబంధనలకు విరుద్ధంగా పడవేసిన ఎడల వారిని మొట్టమొదటిసారి పట్టుకొని వారికి 25 వేల రూపాయలు రెండవసారి పట్టుకుని న ఎడల 50 వేలు మూడవసారి పట్టుకున్న యెడల లక్ష రూపాయలు పెనాల్టీ విధించి మరియు క్రిమినల్ కేసు ఫైల్ చేయబడును. కావున ఇంటి యజమానులు కన్స్ట్రక్షన్ అండ్ డెమోలిషన్వేస్ట్ మెటీరియల్ దేవేందర్ నగర్ రోడ్డులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కన్స్ట్రక్షన్ అండ్ డెమోలేషన్ సెకండరీ కలెక్షన్ పాయింట్ ఎస్ సి టి పి
యందు రాంకీ సంస్థ అండర్ జి.హెచ్.ఎం.సి తో ఏర్పాటు చేసి ఒక మెట్రిక్ టన్ కు నిర్ణయించిన రేటు175 రూపాయలు ప్రకారం అనగా ఒక మినీ టిప్పర్ కు 350 రూపాయల చొప్పున రుసుము చెల్లించి అధికారికంగా ఇక్కడ డెమోలిషన్ అండ్ కన్స్ట్రక్షన్ వేస్ట్ వేయవచ్చునని తెలియజేసినారు. మరియు మీ ఇంటి వ్యర్థాలను నేరుగా మీ ఇంటి వద్దకే వచ్చి మీ యొక్క కన్స్ట్రక్షన్ అండ్ డెమోషన్ వేస్ట్ కలెక్ట్ చేయుటకు ఆన్లైన్ సౌకర్యము కలదు. ఇందుకు మీరు ఒక టన్నుకు 407 రూపాయల 40 పైసల చొప్పున చెల్లించవలసి ఉంటుంది. ఇందుకుగాను మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు18001201159 మరియు వాట్సాప్ నంబర్ 9100927073 కావున ఈ యొక్క నిబంధనలను అందరూ పాటించి జి.హెచ్.ఎం.సి ఉప్పల్ సర్కిల్ కు సహకరించవలసినదిగా తెలియజేసినారు.