డాక్టర్ రాము ఆధ్వర్యంలో పల్స్ పోలియో అవగాహన కార్యక్రమం

వంద శాతం పల్స్ పోలియో చుక్కలు వేయాలి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

కొత్తగూడెం మున్సిపాలిటీ రామవారం 14 నెంబర్ యూపీహెచ్ సి లో డాక్టర్ ఈ. రాము ఆధ్వర్యంలో పల్స్ పోలియో పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రాము మాట్లాడుతూ వైద్య ఆరోగ్య జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మార్చి 3న నేషనల్‌ ఇమ్యూనైజేషన్‌ డే సందర్భంగా మూడు రోజుల పాటు పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని రామవరం యుపిహెచ్సి పరిధిలో నిర్వహించనున్నట్టు తెలియజేసినారు. రామవరం యు పి హెచ్ సి పరిధిలో పంజాబ్ గడ్డ చిట్టి రామవరం చమన్ బస్తి నాగయ్య గడ్డ 14 నెంబర్ ఏడవ నెంబర్ బజార్ మజీద్ మార్కెట్ ఏరియా నెహ్రూ బస్తి ఎస్సీబీ నగర్ సి అర్ పి క్యాంప్ వనం దాసు గడ్డ చెమాన్ ఏరియాలలో పల్స్ పోలియో చుక్కలు వెయ్యాలని ప్రజలకు అవగాహన కల్పించడం కొరకు పల్స్ పోలియోపై అవగాహన కార్యక్రమం ఆశా వర్కర్లు అంగన్వాడీలు సిబ్బందితో నిర్వహించడం జరిగింది .ఐదేళ్ల లోపు చిన్నారులు అందరికీ వంద శాతం పల్స్ పోలియో చుక్కలు వేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ జేబీఎల్ శిరీష ఆదేశాల మేరకు మూడు రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తామని ఏదైనా కారణం చేత పల్స్ పోలియో చుక్కలు వేయని మిగిలిన చిన్నారులకు 4,5 తేదీల్లో ఇంటింటికి తిరిగి వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామన అప్పుడే పుట్టిన శిశువు నుండి 5 సంవత్సరాల పిల్లల వరకు ప్రతి ఒక్కరికి రెండు చుక్కల పోలియో మందు వేయాలన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు అంగన్వాడీ సిబ్బంది వాలంటీర్లు పాల్గొంటారని పల్స్ పోలియోపై అవగాహన కొరకు విస్తృతంగా ప్రచారం చేసే విధంగా చర్యలు చేపడుతున్నామని, వంద శాతం పల్స్ పోలియో చుక్కలు వేసే విధంగా చర్యలు చేపడుతున్నామని.అంగన్వాడి కార్యకర్తలు ఆశ వర్కర్లు,పల్స్ పోలియో పై తల్లిదండ్రులకు అవగాహన పెంచాలని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పల్స్ పోలియోను విజయవంతం చేయాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు ఏ డబ్ల్యు డబ్ల్యు టీచర్లు ఆశ వర్కర్లు అంగన్వాడీలు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *