PUC Certificate Mandatory for Fuel Supply in Delhi
టీమిండియా ఓపెనర్‌కు అస్వస్థత.. ఏమైందంటే?
టీమిండియా స్టార్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అస్వస్థతకు గురయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత తీవ్రమైన కడుపు నొప్పితో బాధ పడ్డాడు. దీంతో అతడిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
అయినప్పటికీ..
యశస్వి జైస్వాల్(15) విఫలమైనప్పటికీ.. సూపర్ లీగ్ గ్రూప్ బీ మ్యాచులో అజింక్య రహానే(72*), సర్ఫరాజ్ ఖాన్(73) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో రాజస్థాన్ జట్టు ముంబైపై మూడు వికెట్ల తేడాతో ఓడింది.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జైస్వాల్ మూడు మ్యాచ్‌లలో 48.33 సగటు, 168.6 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 145 పరుగులు సాధించాడు. ఈ దేశవాళీ టీ20 టోర్నమెంట్‌కు ముందు యశస్వీ జైస్వాల్ దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాల్గొని 78 సగటుతో 156 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే.
