ఆవాసం అమెరికాలో! రాజకీయం పాలకుర్తి లో!!

https://epaper.netidhatri.com/

`ప్యారాచూట్‌ రాజకీయాలు పాలకుర్తిలో పారవు!

`హడావుడి చేయడానికి ఆర్భాటం కాదు…రాజకీయం!?

`రాజకీయమంటే జేజేలు కాదు! ప్రజల మనసు గెల్చుచుకోవడం!!

`నాలుగు రోజులు నాట్లు వేస్తే సాగు కష్టం తెలుస్తుంది?

`క్షణం తీరిక లేక జనంలో వుంటే రాజకీయం అర్థమౌతుంది.

`ప్రజలకు సేవ చేయడమంటే తాతల పేరు చెప్పుకోవడం కాదు.

`ప్రజాసేవ అంటే ఫ్లైట్‌ ఎక్కి దిగినంత సులువు కాదు!

`ముప్పై ఏళ్లలో గుర్తురాని ప్రజల మీద పుటుక్కున ప్రేమెందుకొచ్చింది?

`పాలకుర్తి ప్రజల మీద ప్రేముంటే ఇన్నేళ్లేమయ్యింది!?

`తెలంగాణ బాగు పడిరదనగానే అధికారం కలపడిరదా?

`నిత్యం ప్రజలకు అందుబాటులో వుండాలి.

`ఇల్లు అమెరికాలో, రాజకీయం తెలంగాణ లోనా!?

`గెలిచినా, ఓడినా పాలకుర్తి లోనే వుంటారా?

`పరపతి పెంచుకోవడానికి నటించేది ప్రజాసేవ కాదు!

`పండగల కోసం, పబ్బాల కోసమే పలకరించి పోవడం అసలే కాదు!

`దశాబ్దాల తర్వాత గుర్తొచ్చే కల కాదు!

`ప్రజలే జీవితమై బతకాలి…జనమే ఆశ, శ్వాసగా వుండాలి.

`ఓట్లంటే.. నాలుగు రోజులు కొట్టించుకునే చప్పట్లు కాదు..!

`పేడనీళ్లు కొట్టించినంతనే ఓట్లు రాలవు?

`పైసలతో చేసే రాజకీయం పది రోజులే!

`ప్రజా సమస్యలు తీర్చడమంటే జీవితం త్యాగం చేయాలే!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

నేను మీ పాలకుర్తి నియోజకవర్గం. నా నియోజకవర్గం పాలన ఇప్పటి వరకు మంత్రి దయకర్‌ రావు నాయకత్వంలో సాగుతోంది. ఈసారి ఎన్నికల నగారా మోగింది. అభ్యర్థుల ప్రకటనలు జరుగుతున్నాయి. అయినా ప్రధానంగా చెప్పుకోవాల్సిన పార్టీల విషయానికి వస్తే రెండు. అధికార బిఆర్‌ఎస్‌ పార్టీ , కాంగ్రెస్‌ ల పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కానీ వార్‌ వన్‌ సైడా..కాదా అన్నదానికి సమయం వుందిలే…కాకపోతే!
ఇప్పటి వరకు నా ఆలనా, పాలన చూస్తున్న మంత్రి దయకర్‌ రావు నిత్యం నాకు అందుబాటులో వుంటారు. ఆయన సతీమణి ఎప్పుడూ నియోజకవర్గంలోనే వుంటుంది. ప్రజలకు ప్రతి క్షణం అందుబాటులో వుంటుంది. నియోజకవర్గ లెవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కలవడానికి, తమ గోడు వినిపించుకునే అవకాశం వుంటుంది. మంత్రి దయకర్‌ రావు వివిధ ప్రభుత్వ పనుల మీద రాష్ట్రంలో తిరగాల్సి వచ్చినా, ప్రజల కోసం ఆమె నిత్యం నియోజకవర్గంలోనే వుంటారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు కొందరు సహాయకులు కూడా ఎప్పుడూ రెడీగా వుంటారు. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ లో వున్నా అంటూ రaాన్సిరెడ్డి వస్తున్నారు. హంగామా చేస్తున్నారు. జేజేలు కొట్డించుకుంటున్నారు. పాలకుర్తి ని ఏలే బాగ్యం ప్రసాదించమని ప్రజలను కోరుతున్నారు. ఇంత వరకు బాగానే వుంది. ఆమె ఆవాసమేమే అమెరికాలో వుంది. అయిన వాళ్లంతా అక్కడే వున్నారు. ఇప్పటి దాకా ఏదో పండగకో, పబ్బానికో ఏ మూడేళ్లకో, ఐదేళ్లకో వచ్చి వెళ్తుండేవారని తెలుస్తోంది. అది కూడా వాళ్ల ఊరుకే వచ్చి పోయేవారట. నన్ను పెద్దగా పలకరించిన పాపాన పోయింది లేదు. ఇప్పుడొచ్చి పాలకుర్తి నాదంటున్నారు. అయినా అవాసం అమెరికాలో!
రాజకీయం పాలకుర్తి లో!! చేస్తానంటే చెల్లుతుందా? అందుకు ఎన్నికల సంఘం అంగీకరిస్తుందా? అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. అయినా అక్కడెక్కడో అమెరికా లో సప్త సముద్రాల అవతల నుంచి వచ్చి ఈడ రాజకీయం చేయడం సాధ్యమేనా! అనుకుంటున్నారు..మరి పాలకుర్తి లో రాజకీయం చేయాలంటే ఇక్కడే వుండాలి. సపోజ్‌..పర్‌ సపోజ్‌ గెలిస్తే ఫరవా లేదు.. ఓడితే…అప్పుడు నన్ను వదిలేసి వెళ్లవని గ్యారెంటీ ఏమిటి? నిన్ను నమ్ముకున్న వాళ్లను నట్టెట ముంచిపోవన్న నమ్మకమేమిటి? ఏదో నీ మాటలు నమ్మో…లేక నాలుగు కాసులకు కక్కుర్తి పడో రాజకీయం లో జై కొట్టిన వాళ్ల సంగతేం గాను…ఎన్నికల్లో నీకు మద్దతు దారులుగా మారి ప్రచారం చేసిన వారి రాజకీయ భవిష్యత్తు ఎలా? వాళ్లను గాలికి వదిలేసి వెళ్తే వారి పరిస్థితి ఏం కావాలి. రాజకీయాలన్న తర్వాత ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఎప్పుడూ కార్యకర్తలకు అండగా వుండాలి. రాజకీయంగా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ధైర్యం చెప్పేందుకు కావాలి. ఎన్నికల పుణ్యమా అని నాలుగు రోజుల రాజకీయ కాలక్షేపం చేసి అమెరికా వెళ్లిపోతే వారి బాగోగులు చూసేదెవరు? నా గురించి కొట్లాడేదెవరు. ఇప్పటి దాక నియోజకవర్గం లో నాయకులౌదామని ఎంతో మంది ఆశపడ్డారు. వాళ్లు వాళ్ల రాజకీయం బాగానే చేశారు. ఇప్పుడు హటాత్తుగా ఊడిపడి వచ్చేశా! అంటే పార్టీ నాయకులే నమ్మాలా? వద్దా? అని ఇంకా ఆలోచనలోనే వున్నారు. నీకు కూడా టిక్కెట్‌ ఖరారు కాలేదు. ఇన్ని గందరగోళాల మధ్య వచ్చి సాధించేదేమిటి? వున్న పేరు చెడగొట్టుకోవడమేటి? ఒక్కసారి రాజకీయం మొదలుపెడితే కడదాకా చేయాలి. అంతే గాని ప్యారాచూట్‌ రాజకీయాలు పాలకుర్తిలో పారవు!
ఇక మిగతా విషయాలకు వస్తే రాజకీయమంటే హడావుడి చేయడానికి ఆర్భాటం కాదు… రాజకీయమంటే జేజేలు కాదు! ప్రజల మనసు గెల్చుచుకోవడం!!
ఈ మాటలు ఎవరూ చెప్పినట్లు లేరు. రాజకీయాలలో మంచి చెప్పేవారు చాలా తక్కువ. ఎగదోసేవారే ఎక్కువ. నాలుగు పైసలు ఖర్చు పెట్టుకోగలరని ఎవరి గురించైనా తెలిస్తే చాలు..వాళ్ల ఆస్థి హారతి కర్పూరం అయ్యేదాక వదలరు. రాజకీయ ప్రపంచంలో పదవులలో ఊరేగింపు అన్నది దేవుళ్లకు పూజలు జరిపించినంత ఘనం జరిపిస్తారు. ఆ సొమ్మంతా వాళ్లతోనే పెట్టించి మాయా ప్రపంచంలోకి నెట్టేస్తారు. రాజకీయాలలో ఎవరైనా సరే గెలిస్తే సరి. ఓడిపోతే ఎన్నికల సమయంలో ప్రతి క్షణం కళ్ల ముందున్న వాళ్లు మళ్ళీ కనిపించరు. అందులోనూ పాలకుర్తి నియోజకవర్గం అంటే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఇలాకా. ఆయన ఇప్పటికే రెండు సార్లు గెలిచారు. పదేళ్లుగా నియోజకవర్గం అభివృద్ధి చేశారు. ఊరూరు కొట్టిన పిండి. ప్రతి గడపకు ఆయన పెన్నిది. ప్రజల కష్ట సుఖాలలో అండగా వుండే నాయకుడు. 2014 ఎన్నికల తర్వాత తెలంగాణ వ్యాప్తంగా డెంగ్యూ జ్వరాల విజృంభించాయి. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతికారు. ముఖ్యంగా తండాల ప్రజలకు అప్పుడు కనీస వైద్యం అందుబాటులో లేదు. డాక్టర్లు కూడా ఆయా గ్రామాలకు వెళ్లే పరిస్థితి లేదు. అలాంటి సమయంలో దయాకర్‌ రావు అనేక హెల్త్‌ క్యాంపులు నిర్వహించారు. అత్యవసర వైద్య సేవల కోసం అనేక ప్రైవేటు అంబులెన్స్‌ లు ఏర్పాటు చేశారు. నియోజకవర్గం లోని ప్రజలలో ఎవరికి డెంగ్యూ నిర్థారణ జరగ్గానే వారిని హైదరాబాదు ప్రైవేటు ఆసుపత్రిలకు తరలించి చికిత్స అందించి ఎంతో మంది ప్రాణాలు కాపాడాడు. కోట్లాది రూపాయల బిల్లులు పేద ప్రజల ప్రాణాల కోసం వెచ్చించాడు. అప్పుడు నువ్వు ఒక్కసారి కూడా నియోజకవర్గానికి రాలేదు. ప్రజలను ఆదుకోలేదు. ఇక ప్రపంచమంతా కరోనా గజగజలాడిరచినప్పుడు, ప్రజలకు తన సొంత నిధులతో ఆదుకున్న నాయకుడు దయాకర్‌ రావు. ఆ సమయంలో కరోనా సోకిన వారి చికిత్స కోసం వాడిన రెమిడిస్‌ వేర్‌ ఇంజక్షన్లు సొంత ఖర్చులతో ఉచితంగా అందించారు. అడిగిన వారందరికీ తెప్పించి, ఇచ్చి వారి ప్రాణాలు కాపాడారు. కోట్లాది రూపాయలతో ప్రజలకు నిత్యవస వస్తువులు సమకూర్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని పొద్దులు చెప్పినా ఒడిశే ముచ్చట కాదు. మరి రaాన్సిరెడ్డి చేసింది ఏముందంటే? ఏం చెబుతావమ్మా? అయినా రాజకీయమంటే మాటలా?
నాలుగు రోజులు నాట్లు వేస్తే సాగు కష్టం తెలుస్తుంది? క్షణం తీరిక లేక జనంలో వుంటే రాజకీయం అర్థమౌతుంది.
ప్రజలకు సేవ చేయడమంటే తాతల పేరు చెప్పుకోవడం కాదని ఎవరూ చెప్పలేదా! ఇది పాత కాలం కాదు. ఆ గౌరవాలు ఇప్పుడు రాజకీయాలలో లేవు. వున్నా ముఖస్తుతి తప్ప, మనసులోతుల్లో ఆ అభిమానాలకు చోటు లేదు. దూరపు కొండలు నునుపు. అమెరికా లో వుంటూ, పాలకుర్తి ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారనే భ్రమలో వుండివుంటారు. మమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకునే నాయకుడే ప్రజలకు కావాలి. ప్రజల ఆదరణ కేవలం ఎన్నికల వరకే…ఆ మరుక్షణం నుంచి నాయకుల బాధ్యతే. అందులోనూ అమెరికా లో మీరు చూసే రాజకీయాలకు, మన దేశ రాజకీయాలు చాలా తేడా! ఇక్కడ ప్రజలకు ఏ సమస్య ఎదురైనా ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు దగ్గరుండి పరిష్కరించాలి. అమెరికా లో లాగా సిస్టమ్‌ చూసుకుంటుంది అనుకుంటే సరిపోదు. ఎమ్మెల్యేలు చట్టాలు చేయాలి తప్ప పనులు చేయడం ఏమిటి? అనే ప్రశ్న ఉత్పన్నం కావొద్దు. గ్రామ వార్డు సభ్యుని పని దగ్గర నుంచి పై స్థాయి పని వరకు అన్నింటికీ ఎమ్మెల్యేనే బాధ్యులు. అన్ని రకాల పనల ఒత్తిడి నిత్యం అనుభవిస్తూ, చెదరని చెరునవ్వుతో, అలసట లేని కాలం గడపాలి. ఆటవిడుపుగానో, కాలక్షేపానికో ఎమ్మెల్యే ఎక్కడికైనా వెళ్తే చాలు…ప్రజా సమస్యలు గాలికి వదిలేశారంటారు. ముందు నుయ్యి, వెనుక గొయ్యి లాంటి పరిస్థితి నాయకులది. మరి ప్రజాసేవ అంటే ఫ్లైట్‌ ఎక్కి దిగినంత సులువు కాదు!
ముప్పై ఏళ్లలో గుర్తురాని ప్రజల మీద పుటుక్కున ప్రేమెందుకొచ్చింది? అనే ప్రశ్న చాలామంది లో వుంది?
పాలకుర్తి ప్రజల మీద ప్రేముంటే ఇన్నేళ్లేమయ్యింది!? అని కూడా అడుగుతారు? తెలంగాణ బాగు పడిరదనగానే అధికారం కలపడిరదా? అనే దానికి కూడా సమాధానం చెప్పకోవాల్సి రావొచ్చు. ఎందుకంటే తెలంగాణ రాక కోసం పద్నాలుగు సంవత్సరాల పోరాటం జరిగింది. తెలంగాణ వచ్చింది. ఇప్పుడు తెలంగాణ దేశంలోనే గొప్ప రాష్ట్రంగా విరాజిల్లుతోంది. అందులోనూ పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఏటా పదుల సంఖ్యలో జాతీయ స్థాయిలో అవార్డులు తెచ్చిపెట్టారు. పల్లెలను ఎంతగానో అభివృద్ధి చేశారు. పాలకుర్తిని సుందరంగా తీర్చిదిద్దారు. ఒక రకంగా చెప్పాలంటే పాలకుర్తికి అన్ని హంగులు అద్దారు. అలాంటి నాయకుడిని ఎదుర్కోవాలంటే ఇలా వచ్చి అలా వెళ్లిపోతా అంటే కుదరదు. నిత్యం ప్రజలకు అందుబాటులో వుండాలి. పరపతి పెంచుకోవడానికి నటించేది ప్రజాసేవ కాదు! పండగల కోసం, పబ్బాల కోసమే పలకరించి పోవడం అసలే కాదు! దశాబ్దాల తర్వాత గుర్తొచ్చే కల కాదు! ప్రజలే జీవితమై బతకాలి…జనమే ఆశ, శ్వాసగా వుండాలి. ఓట్లంటే.. నాలుగు రోజులు కొట్టించుకునే చప్పట్లు కాదు..! పేడనీళ్లు చల్లించి ప్రజల దృష్టిని మళ్లించానని అనుకుంటే సరిపోదు. అంత మాత్రాన ఓట్లు రాలవు? ఇవ్వాల మిమ్మల్ని నమ్మి దయాకర్‌ రావు పోస్టర్ల మీద పేడ నీళ్లు చల్లిన వారైనా, మళ్ళీ రేపటి రోజు ఆయన సాయం కోసం వెళ్లాల్సిన వాళ్లే…పైసలతో చేసే రాజకీయం పది రోజులే! ప్రజా సమస్యలు తీర్చడమంటే జీవితం త్యాగం చేయాలే! ఇదీ పాలకుర్తి నియోజకవర్గం గా నేను చెప్పాల్సింది చెప్పాను…తర్వాత మీ ఇష్టం… ఎందుకంటే దయాకర్‌ రావు ముందు పోటీ అంటే పోచమ్మ ముందు పొట్టేలు కట్టేశినట్లే! ఆలోచించుకో మరి!! అయితే నేను.. లేకుంటే …మా కోడలు అని పోటీకి వస్తే…అన్నీ ఆలోచించుకొని దిగున్రీ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!