
మందమర్రి, నేటిధాత్రి:-
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ప్రజా పాలన సహాయ కేంద్రాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని మండల ఎంపిడిఓ ఎన్ రాజేశ్వర్ తెలిపారు. శనివారం మండల ఎంపిడిఓ కార్యాలయంలో ఆయన సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంతకుముందు నిర్వహించిన ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలలో తప్పులు ఉంటే సరిదిద్దడానికి సహాయ కేంద్రం పనిచేస్తుందని తెలిపారు. గృహ జ్యోతి, మహాలక్ష్మి పథకాలకు లబ్ధిదారుల పేరు, ఆధార్ కార్డు, రేషన్ కార్డులో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే దరఖాస్తుదారులకు సహాయ కేంద్రంలో అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా కొత్తగా ప్రజాపాలన దరఖాస్తులు సైతం స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.