కామారెడ్డి జిల్లా మద్నూర్ నేటి ధాత్రి:
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం ఉదయం ప్రజా పాలన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన వారి నుంచి కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, తదితర పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి నాగరాజు, ఎంపీడీవో రాణి, గ్రామ పంచాయతీ కార్యదర్శి సందీప్ కుమార్, చౌలావార్ హన్మండ్లు స్వామి, గడ్డం లక్ష్మణ్, వివిధ శాఖల అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
మండల ప్రత్యేక అధికారి నాగరాజు మాట్లాడుతూ, గ్రామస్థుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి ఈ గ్రామసభలు కీలకమైనవని చెప్పారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సహాయం అందించేలా పథకాలు రూపొందించబడినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్థులు కొత్త రేషన్ కార్డులు మరియు రైతు భరోసా పథకాలకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించారు. అధికారులు ప్రతి సమస్యను గమనించి, వాటికి తగిన పరిష్కారాలు సూచించారు. గ్రామస్థుల నుంచి వచ్చిన స్పందన పట్ల అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.