మంచిర్యాల,నేటి ధాత్రి:
ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
ప్రజావాణిలో అందించిన దరఖాస్తులను అధికారులు సమన్వయంతో త్వరగా పరిష్కరించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.సోమవారం కలెక్టరేట్ లో ఆర్డీవోలు శ్రీనివాసరావు, హరికృష్ణ లతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు.వేలాల శివారు ఇసుక క్వారీలో అవకతవకలు నెలకొన్నాయని జాడి యేసయ్య దరఖాస్తు అందజేశారు.పలువురు ఆర్జీదారులు తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలు సమర్పించారు.