గొల్లపల్లి నేటి ధాత్రి:
రాజ్యాంగం ద్వారా కల్పించిన పౌర హక్కులపైై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తహసిల్దార్ జమీర్ పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని తిరుమలాపూర్ (పీడీ) గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ జమీర్ మాట్లాడుతూ కుల వివక్ష, అంటరానితనం, హక్కులకు భంగం కలిగించడం తదితర అంశాల పై అవగాహన కల్పించి చట్టాల గురించి గ్రామ ప్రజలకు వివరించారు. గ్రామంలో కుల మతాలకు అతీతంగా అందరూ కలి ఉండాలని, ఎవరు కూడా కులం, మతం పేరిట దూషించడం చేయవద్దని సూచించారు. ప్రజలు పౌర హక్కుల పై అవగాహన కలిగి ఉన్నప్పుడే సమాజంలో మార్పు వస్తుందన్నారు. కుల వివక్ష లేకుండా గ్రామంలో అందరూ సోదర భావంతో కలసి మెలసి ఉండాలన్నారు. గ్రామంలో అంటరానితనం వంటి అమానుషమైన చర్యలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. సోషల్ వెల్ఫేర్ అధికారి మహేందర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకోవాలని చదువుకోవడం వల్లనే సంఘంలో గౌరవ మర్యాదలు దొరుకుతాయని, చదువు లేకుంటే మన హక్కుల గురించి మన కూడా తెలియదని గ్రామంలోని ప్రజలు అందరూ వారి పిల్లలకు సరైన విద్యను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ జమీర్, ఎంపీడీవో రాoరెడ్డి, ఆర్ ఐ జీవన్, స్పెషల్ ఆఫీసర్ ఆదిత్య, పంచాయతీ కార్యదర్శి విక్రమ్, హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్, బతికేపల్లి విద్యుత్ ఏఈ, సోషల్ వెల్ఫేర్ అధికారి మహేందర్, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, అంగన్వాడి టీచర్స్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.