# వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య
# దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ను పరిశీలించిన కలెక్టర్
నల్లబెల్లి,నేటిధాత్రి :
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.శుక్రవారం నల్లబెల్లి మండలం నందిగామ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద కొనసాగుతున్న ప్రజా పాలన దరఖాస్తు స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. అభయహస్తం దరఖాస్తుల స్వీకరణను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమర్థవంతంగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు.ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, ఎలాంటి సమస్యలు ఉన్న అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు
ఐదు గ్యారంటీలతో పాటుగా ఇతర సమస్యలకు చెందిన దరఖాస్తులను సాధారణ కౌంటర్ లో అందజేయాలని తెలిపారు. దరఖాస్తుదారులు రేషన్,ఆధార్ కార్డులకు చెందిన సమాచారాన్ని జాగ్రత్తగా పూరించాలని, వారు అందజేసిన పూర్తి సమాచారాన్ని ఆన్ లైన్ లో నమోదు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం లో డిఎస్డిఓ ప్రత్యేకాధికారి భాగ్యలక్ష్మి, ఎంపిడిఓ విజయ కుమార్,తహశీల్దార్ రాజేష్, ఎంపిఓ ప్రకాష్, సర్పంచ్ నాగుల గాని సలేంద్ర నాగేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి వట్టి రాజు, గ్రామస్తులుతదితరులు పాల్గొన్నారు.