అర్జీదారులు తప్పుడు నివేదిక సమర్పిస్తే ఒకటి రెండు సార్లు సరిచూసుకుని పూర్తిస్థాయిలో సమాచారాన్ని సేకరించాలి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
జయశంకర్ భూపాలపల్లి
గణపురం నేటి ధాత్రి గణపురం మండలంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభయ హస్తం కార్యక్రమంలో భాగంగా ఆరు గ్యారెంటీల
ప్రజాపాలన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఆన్లైన్లో పొందుపరచాలి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు
గణపురం మండలంలో గురువారం జిల్లాలోని గణపురం మండల ప్రజాపరిషత్ కార్యాలయం తహశీల్దార్ కార్యాలయాల్లో అర్జీదారుల దరఖాస్తులను పరిశీలించారు
కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులు ఆధార్ రేషన్ కార్డు మరియు గ్యాస్ కనెక్షన్ నెంబర్ లను
ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా పరిశీలించి ఆన్లైన్లో పొందుపరిచిన వివరాలు ధరఖాస్తులో ఉన్న నెంబర్లను బేరుజు చేసుకోవాలని
ఒక వేళ డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఒక నెంబర్ తప్పుగా నమోదు చేసిన చాలా మంది ఆరు గ్యారెంటీల పథకాలకు అనర్హులుగా ఉండి పోతారని కావున ఒక అప్లికేషన్
ఫారంను ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులు తప్పుడు నివేదిక ఇచ్చినట్లైతే మొబైల్ ఫొన్ ద్వారా సరైన సమాచారాన్ని
సేకరించాలని లేని యెడల నేరుగా అర్జీదారుల ఇంటికి వెళ్లి సంక్షిప్తసమాచారాన్ని సేకరించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో గణపురం మండల ప్రత్యేక అధికారి పురుషోత్తం,
ఎం పి డి ఓ అరుంధతి, సురేందర్ తాశీల్దార్లు,మురళీధర్,
సత్యనారాయణ స్వామి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
జిల్లా పౌరసంభందాల అధికారి జయశంకర్ భూపాలపల్లి చే జారిచేయనైనది