Free Drinking Water Facility Launched
స్థానిక ప్రజలకు త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు
– మార్కండేయ ఫార్మసీ ఆధ్వర్యంలో
సిరిసిల్ల(నేటి ధాత్రి):
ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన సిరిసిల్ల డిఎస్పీ. సిరిసిల్ల పట్టణ పరిధిలోని పాత బస్టాండ్ వద్ద మార్కండేయ ఫార్మసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డిఎస్పీ నాగేంద్రచారి ప్రారంభించారు. వేసవి కాలంలో ప్రయాణికులు, స్థానిక ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం అని డిఎస్పీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా డిఎస్పీ నాగేంద్రచారి మాట్లాడుతూ, ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని, మరిన్ని సంస్థలు ముందుకు వచ్చి ప్రజలకు సహాయం చేయాలని సూచించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఫార్మసీ సభ్యులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
