ప్రభుత్వ ఆసుపత్రిలో కూలింగ్ వాటర్ ఫ్రిడ్జ్ ఏర్పాటు
ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి
ఏఎస్ రావు నగర్ నేటి ధాత్రి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లానేటిధాత్రి:
ఎఎస్ రావు నగర్ డివిజన్ లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఏ ఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షులు కేశెట్టి ప్రసాద్ తల్లి గారి జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన వాటర్ కూలింగ్ ఫ్రిడ్జ్ ను ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ప్రారంభించారు వారు ఈ యొక్క కార్యక్రమంలో మాట్లాడుతూ
ఆరోగ్య కేంద్రంలో వాటర్ కూలింగ్ ఫ్రిడ్జ్ ను ఏర్పాటు చేయడంతో రోగులకు, ఆస్పత్రిలో పని చేసే సిబ్బందికి వేసవిలో దాహార్తిని తీర్చేందుకుఉపయోగపడుతుందని అన్నారు
వాటర్ కూలింగ్ ఫ్రిడ్జ్ ను ఏర్పాటు చేసినందుకు కేశెట్టి ప్రసాద్ ను ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి అభినందించారు.
కార్యక్రమంలో కో ఆర్డినేటర్ రాజేంద్రన్, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విట్టల్ నాయక్, సీనియర్ నాయకులు అజిజ్, సుంకు శ్రీకాంత్ రెడ్డి, పెద్ది నాగరాజు, పెద్ది శ్రీను, తాడూరి అనిల్ కుమార్, భద్రగామ నరసింహ, మామిడి శ్రీనివాస్, పూర్ణ యాదవ్, మల్లారెడ్డి,శ్రీహరి, సత్యనారాయణ, తాడూరి ఉష రాణి,భవాని, సునీత, సంధ్య, మాదవి, మీనా, రాణి,మరియ తదితరులు పాల్గొన్నారు.