జర్నలిస్టులకు ప్రమాద బీమా అందించడం అభినందనీయం
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
జర్నలిస్టులకు వ్యక్తిగత ప్రమాద బీమా అవసరం అని, టీ.ఎస్.జె.యూ జర్నలిస్టులకు ప్రమాద బీమా అందించడం అభినందనీయమని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.
తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీ.ఎస్.జె.యు) ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ శర్మ చేతుల మీదుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా జర్నలిస్టులకు వ్యక్తిగత ప్రమాద బీమా పత్రాలను అందజేశారు.
రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నారగౌని ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్,ఎన్ యుజె(ఐ)జాతీయ కార్యదర్శి మెరుగు చంద్రమోహన్ ఆధ్వర్యంలో టీఎస్ జెయు జిల్లా కమిటీ సభ్యులు కలసి జర్నలిస్టుల దాడులకు సంబంధించిన కమిటీని పునరుద్ధరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జర్నలిస్టులకు టీ.ఎస్.జె.యు ఆధ్వర్యంలో రూ.5 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా ఇవ్వడం సంతోషకరమని అన్నారు.
విధి నిర్వహణలో రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా వార్తా సేకరణలో భాగంగా ఎంతో మంది జర్నలిస్టులు ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు.అలాంటి సమయంలో వీరికి ప్రమాద బీమా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
టీఎస్ జె యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ప్రభుత్వ కల్పించే సంక్షేమ పథకాల్లో జర్నలిస్టులకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని కోరారు. హెల్త్ కార్డులు అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో పని చేసే విధంగా చొరవ తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్,జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవీందర్,జిల్లా ఉపాధ్యక్షులు,గట్టు రవీందర్,సంయుక్త కార్యదర్శులు పల్నాటి రాజు,కడపాక రవి,కోశాధికారి గా సంగెమ్ శేఖర్,ఆర్గనైజ్ సెక్రెటరీ మారేపల్లి చంద్రమౌళి,బొల్లపెల్లి.జగన్,ఈసి సభ్యుడు కె.దేవేందర్ మీడియా ఇంచార్జి కార్కూరి సతీష్.. తదితరులు పాల్గొన్నారు