శాయంపేట నేటి ధాత్రి;
శాయంపేట మండలం నేరేడు పల్లి గ్రామంలో నిన్న రాత్రి అనారోగ్యంతో మరణించిన జన్ను సమ్మక్క కుటుంబాన్ని భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి ఆదేశానుసారం మృతురాలి కుటుంబాన్ని బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఆకుతోట సమ్మిరెడ్డి యువజన నాయకులు పోరండ్ల చరణ్ కలిసి పరామర్శించి 4,000/- రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారి కుటుంబానికి అన్నివేళలా అందుబాటులో ఉండి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బొమ్మెన రమేష్, నాయకులు శేషాల శ్రీనివాస్,కుక్కల రాజు, ఎండి రఫీ,దొడ్డిపాక రవి,ఒడ్డెపల్లి రాజేందర్,మంద కుమారస్వామి,ఏకెల్లి రాజయ్య,కొయ్యడ విజయ్,కళ్లెపు సాంబయ్య, జన్ను ఎల్లయ్య ఒడ్డెపల్లి అర్జున్, చరణ్ ,మంద పోశాలు తదితరులు పాల్గొన్నారు.