
Congress
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం ఒక వరం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నవాబుపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి వెంకటయ్య
శంకర్ పల్లి, నేటిధాత్రి :
బీసీల రిజర్వేషన్ 42 శాతనికి పెంచడం బీసీ ప్రజలకి ఒక గొప్ప వరమని నవాబుపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి వెంకటయ్య అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
భారతదేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా అత్యధికంగా ఉన్న బీసీ ప్రజల కోసం వారి యొక్క ఉద్యోగాల్లో గానీ స్థానిక సంస్థల పదవుల్లో గానీ ఉన్నత స్థానం కల్పించాలనే సదుద్దేశంతో 42 శాతం రిజర్వేషన్ ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు సహచర మంత్రులకు బీసీ సంక్షేమం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గడిచిన గత పది సంవత్సరాలలో ఏనాడు కూడా
బి ఆర్ యస్ పార్టీ, బీసీల గురించి ఆలోచించ లేదు కదా వారికీ కనీస విలువ కూడా ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అతి కొద్ది రోజులలోనే బీసీ ల పట్ల చూపించిన గౌరవానికి ఎల్లపుడు పార్టీ కి రుణపడి ఉంటామని తెలియజేస్తూ రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసారు. ఈ కార్యక్రమంలో మండల బీసీ సెల్ అధ్యక్షులు జూలకంటి శ్రీధర్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.