మందమర్రి, నేటిధాత్రి:-
పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి మహంత్ అర్జున్ కుమార్ నేతృత్వంలో బుధవారం విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, జమెట్రి బాక్స్ లను అందజేశారు. ఈ సందర్భంగా మహంత్ అర్జున్ మాట్లాడుతూ, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో విద్యార్థినిలకు పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. 10వ తరగతి పరీక్ష రాసే విద్యార్థులు రానున్న పరీక్ష సమయంలో చదువుపై దృష్టి సారించి మంచి ఉత్తీర్ణత సాధించాలని, ఇంకా ఎన్నో విజయాలు అధిరోహించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కవిద్యార్థి కి అందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం శ్రీనివాస్, ఎల్పుల కిరణ్ కుమార్, ఒరుగంటి సురేందర్, సాయి, శ్రీకాంత్, ప్రసాద్, వెంకటేష్, అష్రాఫ్, నరేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.