శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలంలోని రాజుపల్లి గ్రామానికి చెందిన ఆవుల దిలీప్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. విషయం తెలుసుకున్న శ్రీ మహేశ్వర మున్నూరు కాపు సంఘం సభ్యులు మృత దేహాన్ని సందర్శించి నివాళు లర్పించారు దిలీప్ కుటుంబాన్ని పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని సంఘం తరఫున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. తక్షణ సహాయం కింద 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.