MRS Protest at Mahadevpur MRO Office Against CJI Attack
*నల్లజెండాలతో తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన **
*సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి పై దాడిని ఖండిస్తున్నాం
*ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ
*మహాదేవపూర్ అక్టోబర్ 17 నేటి ధాత్రి **
మహదేవపూర్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్ శ్రేణులు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాట్లాడుతూ సుప్రీంకోర్టుపై ప్రధాన న్యాయమూర్తి సిజెఐ గవాయి పై దాడి చేసిన వ్యక్తులను అరెస్టు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిని దాడి వెనుక ఉండి ప్రోత్సహించిన వారిని తక్షణమే అరెస్టు చేసి చట్టబద్ధంగా శిక్షించాలని అదే కాకుండా ప్రధానంగా దళితులపై దాడులను ఖండిస్తున్నామని ఇలాంటి దాడులు సమాజంలో తప్పుడు సంకేతాలకు దారితీస్తాయని ఇప్పటికైనా అధికారులు దళితులపై దాడులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ అన్నారు ఈ కార్యక్రమంలో వి ఎస్ పి ఎస్ మండల అధ్యక్షులు వీరగంటి సమ్మయ్య ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు కోయ్యల భాస్కర్ . టౌన్ ప్రెసిడెంట్ చింతకుంట్ల సదానందం .టౌన్ ఉపాధ్యక్షులు కొలుగురి శ్రీకాంత్ .టౌన్ ప్రధాన కార్యదర్శి లింగాల సుశాంత్. బ్రాహ్మణపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు కాల్వ రాజ సమ్మయ్య .పలుగుల గ్రామ శాఖ అధ్యక్షులు లేతకరి శంకర్ .ఉపాధ్యక్షులు మంద సురేష్ .ఎమ్మార్పీఎస్ నాయకులు చింతకుంట రాము .బెల్లంపల్లి జాషువా. సీనియర్ నాయకులు వేమునూరు జక్కయ్య తదితరులు పాల్గొన్నారు
