మద్యం షాపులను తొలగించాలి.
చిట్యాల, నేటిదాత్రి :
చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఉన్న వైన్ షాపు మరియు బెల్ట్ షాపులను తొలగించాలని వీసీకే పార్టీ సిపిఐ ఎమ్మెల్ మరియు డివైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులతో నిరసన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమం లో పాల్గొన్న సంఘాల నాయకులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రార్థన మందిరాలకు లేదా పాఠశాలలకు 500 మీటర్ల దూరంలో వైన్ షాపులు నడిపించాలని ఆదేశాలు ఇచ్చిన కానీ రాష్ట్ర ప్రభుత్వ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ మాత్రం 100 మీటర్ల పరిధిలో వైన్స్ షాపులు నడిపించవచ్చని ఆదేశాలు ఇచ్చారు. కనీసం వంద మీటర్ల దూరం లేకుండా చిట్యాల మండలంలోని వైన్స్ లు మరియు బెల్ట్ షాపులు ఇష్టఅనుసారంగా విచ్చలవిడిగా నడిపిస్తున్న ఇక్కడి అధికారులు నిమ్మకు నీరెత్తునట్టు భాద్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. ఈ వైన్స్ షాప్స్ మరియు బెల్ట్ షాప్స్ విద్యార్థులు వచ్చే దారిలో ఉండడం వలన విద్యార్థులు మరియు యూవతి యూవకులు టీచర్స్ ఇబ్బందులకు గురి అవుతున్నారు విద్యార్థులు యువత మధ్యనికి ప్రభావితం అవుతున్నారు ఈ ప్రభావితం భవిష్యత్ తరానికి ప్రమాదకరం కావున ఇలాంటి వైన్స్ మరియు బెల్ట్ షాపుల తొలగిచలని అన్నారు,
ఈ కార్యక్రమంలో వికేసి పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షులు అంబాల అనిల్ కుమార్. సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ మరియు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భూక్యా నవీన్. విద్యార్థులు కనకం హితేష్ .ఉదయ్. వినయ్. తదిర్లు పాల్గొన్నారు
