Protest Demanding Recounting Over Vote Counting Fraud
ఓట్ల లెక్కింపులో మోసం జరిగిందని ధర్నా.
రికౌంటింగ్ చేయాలని అభ్యర్తి దాసరి మమత తిరుపతి డిమాండ్.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని అందుకు తండా గ్రామపంచాయతీలోఈ నెల 14 న జరిగిన ఎన్నికల కౌంటింగ్ లో మోసం జరిగిందని అధికార పార్టీ నాయకులు, అధికారులతో,కుమ్మక్కై మాకు అన్యాయం చేశారని బిఆర్ ఎస్ అభ్యర్తి దాసరి మమత తిరుపతి అన్నారు, అలాగే
రికౌంటింగ్ చేయాలని గ్రామంలో తన కార్యకర్తలతో ధర్నా చేయడం జరిగింది, ఈ సందర్భంగా దాసరి మమత తిరుపతి మాట్లాడుతూ అందుకు తండా గ్రామపంచాయతీ ఎన్నికల కౌంటింగ్ సమయంలో అధికారులు కౌంటింగ్ కరెక్ట్ చేయక దాసరి మమత తిరుపతి ఆరు ఓట్ల తేడాతో ఓడిపోయరని అన్నారు, లెక్కింపు సమయంలో
చేల్లని ఓట్లు చూపించక కౌంటింగ్ సరిగా చేయక మమ్మల్ని మోసం చేశారని అందుకు రికౌంటింగ్ చేయమంటే లాఠీ చార్జ్ మా ఫై చేయడం జరిగిందని ఆరోపించారు, రాజ్యాంగబద్ధంగా రికౌంటింగ్ కు వెసులుబాటు ఉందని తెలిసి ఈ విషయంపై కలెక్టర్ ని ఆర్డీవో ని కలవడం జరిగిందని తెలుపగ వారు రికౌంటింగ్ చేయిస్తామని మాతో చెప్పారు, కానీ అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తంచేశరు, ఈ విషయంపై కోర్టులో కుడా కేసు వేయడం జరిగిందని తెలిపారు, ఇట్టి విషయంపై జిల్లా అధికారులు స్పందించి వెంటనే అందుకు తండ గ్రామపంచాయతీ ఎన్నికలలో జరిగిన కౌంటింగ్ ని మరొకసారి రి కౌంటింగ్ చేసి మాకు న్యాయం చేయాలని కోరినారు, ఈ కార్యక్రమంలో దాసరి మమత తిరుపతికి మద్దతుగా ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
