Protest Against Central Government Policies
కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకాలను ప్రతిఘటించాలి
నృసంపేట,నేటిధాత్రి:
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోరబోయిన కుమారస్వామి, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు హన్మకొండ శ్రీధర్ డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా పిలుపులో భాగంగా నర్సంపేట ఆర్డీవో కార్యాలయం ముందు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా అవలంబిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని పిలుపునిచ్చారు.మతం మత్తులో ముంచి ప్రజల ఆస్తులను ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభుత్వం అంటకట్టుతున్నదని దీంతో దేశంలో ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరుగుతున్నాయని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు గడ్డమీదీ బాలకృష్ణ,కందికొండ రాజు,కత్తి కట్టయ్య, పెండ్యాల సారయ్య, బసికె మొగిలి,గోనె మల్లారెడ్డి,కలకోట అనిల్, బుర్రీ ఆంజనేయులు, జినుకల చంద్రమౌళి,కట్కూరి శ్రీనివాసరెడ్డి, సూరయ్య , బాబు, కమతం వెంకన్న, ఎండీ ఫరీదా, విజయ, నాగమణి, స్వప్న, సరిత, కార్తీక్, దాసరి నరేశ్, తదితరులు పాల్గొన్నారు.
