వృక్షో రక్షతి రక్షితః
నడికూడ,నేటిధాత్రి:
ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులచే పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ చెట్ల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థుల చేత నాటకీకరణ చేయించడం అందరినీ ఆకట్టుకున్నది అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ మనం ఈనాడు ఎంతో అందమైన నగరాలలో నివసిస్తున్నప్పటికీ,మానవుని తొలి నివాసాలు మాత్రం అడవులే.అలాంటి అడవులపై ఈనాటికి కూడా మానవుడు ఎంతగానో ఆధారపడి జీవిస్తున్నాడు.
అడవులు మనకు మేఘాలను చల్లబరచి వర్షాన్ని ఇస్తున్నాయని, గృహోపకరణాలకు, వంటచెరకుకు అవసరమైన కలపను అందిస్తున్నాయని,అనేక రకాలైన జంతువులకు, పక్షులకు నివాసప్రాంతాలుగా ఉంటున్నాయని,అనేక రకాలైన మూలికలు, ఔషదాలు అడవులనుండి లభిస్తున్నాయని,కాలుష్యాన్ని నివారించి,పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతున్నాయని, వరదలు సంభవించినపుడు, నేలకోతకు గురికాకుండా అడ్డుకుంటున్నాయని
కాని,నేడు మానవుడు వివిధ అవసరాల కోసం అడవులను నరికివేయడం వలన వర్షపాతానికి,ఆహారానికి లోటు ఏర్పడడమే కాకుండా, వాతావరణ సమతుల్యత దెబ్బతింటుందని,కాబట్టి మనం మన ఇళ్ళలోను, పాఠశాలలోను,ఖాళీ ప్రదేశాలలోను చెట్లు పెంచి పర్యావరణాన్ని కాపాడుదాం.అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కంచరాజు కుమార్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు