రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత
◆- కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి
జహీరాబాద్. నేటి ధాత్రి:
రాజ్యాంగ పరిర క్షణ అందరి బాధ్యత అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి అన్నారు.జైబాపు, జైభీం, జైసంవిధాన్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు జహీరాబాద్ మండలం చిరాగ్ పల్లీ, బూర్దీపాడ్ గ్రామాల్లో పాద యాత్ర నిర్వహించారు.డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి ముప్పు తెచ్చే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు.కేంద్ర ప్రభుత్వ విధానాలు రిజర్వేషన్లకు ముప్పు వాటిల్లే విధంగా ఉన్నాయన్నారు.

అనంతరం జహీరాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి.నర్సింహారెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంగా పేరుగాంచిన భారతదేశంలో రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని విమర్శించారు.కేంద్రం కుట్రలను ప్రజలకు వివరించేందుకు రాహుల్ గాంధీ గ్రామ గ్రామాన పాదయాత్ర చేపట్టాలని నిర్దేశించారని చెప్పారు.ఈకార్యక్రమంలో సిడిసి చైర్మన్ మహ్మద్.ముబీన్,జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి.నర్సింహారెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ భీమయ్య,మాజీ సర్పంచ్ లు నర్సింహారెడ్డి,జగన్మోహన్,మాజీ కౌన్సిలర్ శేఖర్,మాజీ యం.పి.టి.సి లు హన్మంత్ రెడ్డి,నాగి శెట్టి,అశ్విన్ పాటిల్,నాథా నేయల్,మాజీ ఏ ఎం సి వైస్ చైర్మన్ అక్బర్,ఇమామ్ పటేల్,సునీల్ కుమార్,దిలీప్ కుమార్ మరియు మండల యూత్ కాంగ్రెస్ నాయకులు,ఆయా గ్రామాస్తులు,యువకులు కార్యకర్తలు పాల్గొన్నారు.