ప్రభుత్వ భూముల పరిరక్షణ కు ప్రతి జర్నలిష్ట్ క్రుషి అవసరం…

జర్నలిష్ట్ సమస్యల పరిష్కారాన్ని ప్రభుత్వ ద్రుష్టి కి తీసుకువెళ్ళె భాధ్యత మాది…

మెడిపల్లి ప్రెస్ క్లబ్ డైరి ఆవిష్కరణ కర్యక్రమంలొ వజ్రెష్ యాదవ్…

మెడిపల్లి (నేటిధాత్రి) : మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను కాపాడేందుకు మీడియా ప్రత్యేక దృష్టి సారించాలని టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు,మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ అన్నారు.ఈ మేరకు బుధవారం నాడు “మేడిపల్లి మండల ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ ” అధ్వర్యంలో రూపొందించిన 2024 డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ గత పాలనలో ఉన్న లోపాల కారణంగానే ప్రభుత్వం మారిందని ప్రజలు కోరుకున్న మార్పుకు అనుగుణంగా ప్రస్తుత ప్రభుత్వ పాలన ఉంటుందనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.ప్రస్తుతం మీడియా పరిస్థితులు మారాయని మారిన పరిస్థితులను ఉపయోగించి జర్నలిస్టులు పనిచేయాలని సూచించారు.మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూసే బాధ్యతను నియోజకవర్గంలోని ప్రతి జర్నలిస్టు తీసుకోవాలని అన్నారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమస్యకు పరిష్కారం చూపే బాధ్యత నియోజకవర్గంలో నేను తీసుకుంటానని అన్నారు.అదే విదంగా నియోజకవర్గంలోని కార్పొరేషన్లు, మండల కేంద్రాలలో శాశ్వత ప్రెస్ క్లబ్ భవనం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి మేడిపల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కల్కూరి ఎల్లయ్య అధ్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శి చిర్ర శ్రీధర్ రెడ్డి నివేదిక సమర్పించాడు. ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, టీయూడబ్యూజే – ఐజేయూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు గడ్డమీది బాల్ రాజు గౌడ్, డీ‌.వెంకట్ రాంరెడ్డి, బోడుప్పల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్,ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్,సీపీఎం మేడిపల్లి మండల కార్యదర్శి ఎన్.సృజన,
కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ అసెంబ్లీ బీ బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి, యుత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొత్త సుశాంత్ గౌడ్, కార్పొరేటర్లు ఎంపల్ల అనంత్ రెడ్డి,కొత్త చందర్ గౌడ్, రాసాల వెంకటేష్ యాదవ్,బింగి జంగయ్య యాదవ్, సింగిరెడ్డి పద్మారెడ్డి, సుమన్ నాయక్,కో అప్షన్ సభ్యులు బ్రహ్మన్న గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రాల వెంకటేష్ యాదవ్, పులకండ్ల జంగారెడ్డి,ఎంసీపీఐ నాయకులు మూడి మార్టిన్, కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకురాలు దుర్గా, ప్రెస్ క్లబ్ ముఖ్య సలహాదారు వీఎస్ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!