Singareni Retirees Protest MeeSeva Overcharging
మీసేవ కేంద్రాల దోపిడి నుండి కాపాడండి
సింగరేణి విశ్రాంత ఉద్యోగులు జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా లోని మీ సేవ కేంద్రాల యాజమాన్యాల దోపిడి నుండి వేలాది మంది సింగరేణి విశ్రాంత ఉద్యోగులను కాపాడాలని కలెక్టర్ కి సోమవారం విజ్ఞప్తి చేశారు.ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో విశ్రాంత సింగరేణి ఉద్యోగులు పెన్షన్ దారులు జిల్లాలోని మీ సేవ కేంద్రాలలో జీవన్ ప్రమాణ్,డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్స్ తీసుకుంటేనే సింగరేణి పెన్షన్ దారులకు ప్రతి నెల వారి వారి బ్యాంకు ఖాతాలలో పెన్షన్ డబ్బులు జమ అవుతాయని తెలిపారు.సింగరేణి విశ్రాంత ఉద్యోగుల అవసరాన్ని ఆసరా చేసుకొని మీ సేవ కేంద్రాల నిర్వాహకులు వారికి ఇష్టం వచ్చిన విధంగా,ఇష్టరిత్య ఒక్కొక్క మీ సేవా కేంద్రాల ఎజమానులు ఒక్కో పెన్షన్ దారు నుండి 200,150,100 రూపాయిల వరకు తీసుకుంటూ చదువురాని సింగరేణి విశ్రాంత పెన్షన్ దారులను దోపిడీకి గురి చేస్తున్నారని వాపోయారు.ఒక కోల్ మైన్స్ పెన్షన్ కు 50 రూపాయిలు సిపిఎంఆర్ఎస్ ఉద్యోగి వారి జీవిత భాగస్వామికి సంబంధించిన మెడికల్ హెల్త్ కార్డు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్స్ కు 75 రూపాయిలు తీసుకునే విధంగా జిల్లాలోని మీ సేవ కేంద్రాల యజమానులకు ఆదేశాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ని కోరారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, జిల్లా నాయకులు ఏ.గంగయ్య ,బియ్యాల ప్రభాకర్ రావు ,జెడి బీరయ్య, సిహెచ్.వైకుంఠం,కె.రాజిరెడ్డి, డి.సాయిలు,కస్తూరి సూర్యం తదితరులు పాల్గొన్నారు .
