-ప్రభుత్వ భూముల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ సమర శంఖం…
-పీర్జాదిగూడలో కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములపై “ప్రజావాణి”లో ఫిర్యాదు…
-తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకుల…
మేడిపల్లి(నేటీదాత్రీ):
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ‘కాదేది అనర్హం కబ్జాలకు’ అన్న చందంగా పరిస్థితులు తయారయ్యాయి.ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలకు సేవ చేయాల్సిన ప్రజాప్రతినిధులు కంచ చేను మేసిన చందంగా ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేస్తున్నారు.ఈ నేపథ్యంలో పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ నడుము కట్టింది పర్వతపూర్ లో స్మశాన వాటిక డంపింగ్ యార్డులకు కేటాయించిన సర్వే నం 1,10, మరియు 11 లలో గల ప్రభుత్వ భూముల కబ్జాలకు గురయ్యాయని ముస్లిం,క్రిస్టియన్, మైనార్టీ నాయకులతో కలిసి తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం “ప్రజావాణి”లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ పీర్జాగూడ కార్పొరేషన్ పరిధిలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను పరిరక్షించి భావితరాలకు అందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని, హిందూ, ముస్లిం,క్రిస్టియన్ మైనార్టీ నాయకులతో తో కలిసి ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసామని, త్వరలోనే కబ్జాకు గురైన భూములపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని తుంగతుర్తి రవి అన్నారు.ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పన్నాల శ్రీనివాస్ రెడ్డి, ముదిగొండ రమేష్,మజర్, నాగరాజు, యాసారం నగేష్,వంగూరి పరమేష్, ఉదయ్ రాజ్ గౌడ్,అమర్, కరీం మరియు క్రిస్టియన్ ముస్లిం కమిటీ సభ్యులు చార్లెస్, జాకిర్ హుస్సేన్, హసన్ చాచా, రంగా రావు తదితరులు పాల్గొన్నారు.