
సాగరిక ఉప అటవీ క్షేత్ర అధికారి
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం దుబ్బపల్లి గ్రామంలో ఉప అటవీ క్షేత్రాధికారి ఎస్. సాగరిక ఆధ్వర్యంలో అడవుల సంరక్షణ, అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్.సాగరిక మాట్లాడుతూ అడవులలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే జంతువులకు, మొక్కలకు అక్కడున్న జీవజాతికి , ముఖ్యంగా పర్యావరణానికి ప్రమాదం జరుగుతుందని, ప్రస్తుతం వేసవికాలం కాబట్టి అడవులలో ఆకులన్నీ రాలి ఉంటాయి ఒక్క నిప్పురవ్వ పడితే ఆ ఎండిన ఆకులన్నీ కాలి కార్చిచ్చులా మారుతుందని ఆ మంటలని అర్పలంటే చాలా కష్టమవుతుందని, పశువుల కాపరులు, రోడ్లపైన వెళ్లేవారు సిగిరెట్ మరియు బీడీ లను కాల్చి అదేవిధంగా పడేయటం వంటను చేసుకున్న తరువాత ఆ మంటను ఆర్పివేయకపోవడం వలన ఒక్క చిన్న నిప్పురవ్వ గాలిలో కలిసి వేదజల్లినట్టుగా పడితే అడవంతా అగ్నికి ఆహుతి అయిపోతుందని,మీరు వెళ్లే దారిలో ఎక్కడైనా చిన్నగా అడవిలో మంట కనిపిస్తే వెంటనే అర్పివేయాలని, అదేవిధంగా ఒకవేళ చాలా పెద్దగా మంట కనిపిస్తే వెంటనే అడవి అధికారులకు మరియు అగ్నిమాపక సిబ్బంది కి తెలియజేయాలని, ఇప్పుడున్న ఏండలనే మనము తట్టుకోలేక పోతున్నాము అలాంటిది అడవి కాస్త అగ్నికి అహుతి అయితే అక్కడ ఉన్న పక్షులు, జంతువులు, చెట్లు చెమలు ఏవిధంగా ఇబ్బంది పడుతాయో మీరే ఆలోచించాలని,
అడవిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలలో భాగంగా అటవీ శాఖ అధికారులమైన మేము బ్లోవేర్స్ ద్వారా కూలీల ద్వారా ఫైర్ లైన్స్ ను ఏర్పాటు చేస్తున్నాము ఎటువంటి ఇబ్బందులు అడవులకి కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.
కాపాడుదాం కాపాడుదాం – అడవిని అగ్ని భారి నుండి కాపాడుదాం అంటూ నినదించారు. అనంతరం ఎండ నుంచి ఉపశమనం కోసం అందరికీ మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.సాగరిక ఉప అటవీక్షేత్రధికారి , పి. దీక్ష వనసేవకులు ,
శృతి టిఏ, రాము ఎఫ్ఏ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.