వెల్దండ/నేటి ధాత్రి
నాగర్ కర్నూల్ జిల్లాలోని వెల్దండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు చేయాలని హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై సోమవారం నిరసన చేపట్టారు. పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగానికి రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 ఇస్తానని వాగ్దానం చేసి, ఇప్పుడు ఎకరానికి రూ.12 వేలు ఇస్తామనడం సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు రూ.15 వేలను అమలు చేసే విధంగా.. ఆదేశాలు జారీ చేయాలన్నారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ నిరంజన్, నరసింహ, నాగుల నాయక్, మండల యూత్ అధ్యక్షుడు జంగిలి యాదగిరి, పోలే అశోక్, ప్రసాద్, ప్రభాకర్ లాలయ్య, చెన్నయ్య, నాగేశ్, శ్రీను, రవికుమార్ సైదులు, అంజయ్య నరసింహ,మహేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.