నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకుఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుబండ శ్రీశైలం అన్నారు. గురువారం చండూరు మండల పరిధిలోనినేర్మట గ్రామంలో సిపిఎం గ్రామ శాఖ సమావేశం సిపిఎం మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ గౌడ్ అధ్యక్షతనసమావేశం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, .గత ప్రభుత్వం హయాంలోఎన్నికల ముందు ఇచ్చిన హామీలనుఅమలు చేయకపోవడం వలనప్రజలు బిఆర్ఎస్ ను ఇంటికి పంపారనివారు అన్నారు. చర్లగూడెం రిజర్వాయర్ లో ముంపునకు గురైన భూ నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ తో పాటు పునరావాసం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజలు దరఖాస్తు చేసుకున్నారని, దరఖాస్తు చేసుకున్న నిరుపేదలను గుర్తించి,ఇండ్లు లేని పేదలందరికీఇండ్ల స్థలాలు ఇవ్వాలని, ఇండ్ల స్థలాలు ఉన్నవారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మునుగోడు ప్రాంత సమస్యలపై పోరాటం చేసేది కమ్యూనిస్టులేననివారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మోగుదాల వెంకటేశం, సిపిఎం మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్, సిపిఎం మండల కమిటీ సభ్యులు కొత్తపల్లి నరసింహ, చిట్టిమల్ల లింగయ్య, సిపిఎం నాయకులు అంతిరెడ్డి, ఈరటి వెంకటయ్య, ఈరగట్ల స్వామి, గణేష్,బురకల అంజయ్య, గుయ్యని జంగయ్య, బల్లెం స్వామి,వెంకన్న,లక్ష్మమ్మ,తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
