
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను ఆకస్మికంగా సందర్శించిన ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అప్పల ప్రసాద్
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను మంగళవారం ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అప్పల ప్రసాద్ సందర్శించారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజు ఆదేశాల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సందర్శించిన ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అప్పల రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు,వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి సమయపాలన పాటించాలన్నారు. అదేవిధంగా ఉప కేంద్రాల పరిధిలో ఆశ,ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రజలకు వైద్య సేవలు అందించాలన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎలాంటి డెంగ్యూ కేసులు గాని మలేరియా కేసులు గాని నమోదు కాకుండా చూడాలని తెలిపారు.రోగులతో సమన్వయంగా ఉంటూ మందులను ముందస్తుగా నిలువ చేసుకోవాలని ఉపకేంద్ర సిబ్బందితో రోజు మాట్లాడాలని,ప్రభావిత గ్రామాలలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పాముకాటు, కుక్కకాటు మందులను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. అలాగే పంచాయతీల కార్యదర్శులు,ఆరోగ్య కార్యకర్తలు సహజంగా ఉంటూ గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని, ఆశ,అంగన్వాడి,ఆరోగ్య కార్యకర్తలు,మహిళా గ్రూపు సంఘాలు,యూత్ అంతా కలసి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బుక్క వెంకటేశ్వర్లు జిల్లా మాస్ మీడియా అధికారి, ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్,డాక్టర్ అశోక్,డాక్టర్ స్పందన, సీనియర్ అసిస్టెంట్ సంపత్ పాల్గొన్నారు.