# నర్సంపేటలో మొదటి నామినేషన్ ఎంసిపిఐ పార్టీ అభ్యర్థి పెద్దారపు రమేష్, మరో ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ దాఖలు,
# నామినేషన్ల వివరాలు ప్రకటించిన ఎన్నికలు రిటర్నింగ్ అధికారిని, ఆర్డిఓ కృష్ణవేణి
నర్సంపేట నేటిధాత్రి :
త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం మొదలైంది. నర్సంపేట నియోజకవర్గం పరిధిలో శుక్రవారం ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. మొదటిగా నర్సంపేట పట్టణానికి చెందిన ఎంసిపిఐ పార్టీ అభ్యర్థి పెద్దారపు రమేష్ నామినేషన్ వేయగా మరో ఇండిపెండెంట్ అభ్యర్థి ములుగు జిల్లాకు చెందిన ఇమ్మడి చిన్నికృష్ణలు ఎన్నికల రిటర్నింగ్ అధికారినికి నామినేషన్ పత్రాలు అందజేశారు. నర్సంపేట నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కృష్ణవేణి మాట్లాడుతూ శుక్రవారం ఉదయం 11 గంటల నుండి మొదలైన నామినేషన్ల ప్రక్రియ సాయంత్రం మూడు గంటల వరకు ముగిసిందని తెలిపారు. మొదటి రోజు ఎంసీపీఐ పార్టీ అభ్యర్థి పెద్దారపు రమేష్ ఇండిపెండెంట్ అభ్యర్థి చిన్నికృష్ణులు నామినేషన్ వేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారిని ప్రకటించారు.