
Chemical Pollution.
రసాయన కాలుష్యంతో ఇబ్బందులు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం,మండల పరిధిలోని కుప్పా నగర్ గ్రామ శివారులో గల శ్రీత కెమికల్ కంపెనీ రసాయన వాయు కాలుష్యంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారని మండల మైనార్టీ నాయకుడు హాజారుద్దీన్ వాపోయారు. ఈ కంపెనీతో స్థానికంగా ఎవరికి లాభం లేదు. ఈ కంపెనీ ద్వారా వెదజల్లుతున్న రసాయనతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చర్యలు తీసుకొని ఈ కంపెనీ మూసివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కాలుష్యం ద్వారా ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన మండిపడ్డాడు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజలతో కలసి ఉద్యమం చేస్తామని హజారుద్దీన్ తెలిపారు.