హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు పవన్ కళ్యాణ్
పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్ అన్నారు.మంగళవారం రోజున హనుమకొండ లోని జిల్లా విద్యాశాఖ అధికారి కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరకాల పట్టణ కేంద్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుకునే విద్యార్థులు సరైన మౌలిక సదుపా లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు.అలాగే పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి
ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులను నియంత్రించాలని
ప్రభుత్వానికి విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలను మూసివేయాలని డిమాండ్ చేశారు అలాగే
హనుమకొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలకి రెగ్యులర్ ఎంఈఒ లను నియమించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రాకేష్ సందీప్ సాయి తదితరులు పాల్గొన్నారు.