దేశ రాజకీయాలకు మరో ఇందిర ‘‘ప్రియాంక‘‘.
`ఇందిరా గాంధీ మళ్ళీ ఆధిపరాశక్తి రూపం ప్రియాంక.

`బీజేపీ ని గుక్క తిప్పుకోకుండా చేస్తున్నది ప్రియాంక.
`ప్రధాని మోడీకి నేరుగా సవాలు విసురుతున్నది ప్రియాంక.

`నెహ్రు మీద మోడీకి వున్న కోపం వరుసగా లిస్ట్ ప్రకారం చెప్పండని సవాలు విసిరింది ప్రియాంక.
`మళ్ళీ నెహ్రు మీద నోరెత్తొద్దని హెచ్చరించిన బ్రేవ్ లీడర్ ప్రియాంక.

`దేశంలో దమ్ముంటే బ్యాలెట్ ఎన్నికలు పెట్టండని సవాలు విసిరింది ప్రియాంక.
`బ్యాలెట్ పేపర్ తో ఒక్క సీటు కూడా బీజేపీ గెలవదని చెప్పింది ప్రియాంక.
`ధైర్యానికి నానమ్మ రూపం ప్రియాంక.
`దేశానికి రేపటి ఆశాకిరణం ప్రియాంక.
`ఇప్పుడే కాదు రెండున్నర దశబ్దాలకు ముందే ప్రియాంకే వారసురాలు అనుకున్నారు.
`అదే సమయంలో ప్రియాంక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
`రాబర్ట్ వాద్రను పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబానికి పరిమితమయ్యారు.
`రాహుల్ గాంధీ రాజకియ ప్రవేశం చేశారు.
`జానికి రాజీవ్ గాంధీ రాజకీయాలకు వస్తాడని ఎవరూ ఊహించలేదు.
`రాజీవ్ గాంధీ కన్నా ముందే అయన తమ్ముడు సంజయ్ గాంధీ రాజకీయాలలోకి వచ్చారు.
`ఇందిరా గాంధీ కి చేదోడు వాదోడుగా వున్నారు.
`అనుకోకుండా హెలికాప్టర్ ప్రమాదం లో మరణించారు.
`తర్వాత కాలంలో ఆపరేషన్ బ్ల్యూ స్టార్ అనేది పెద్ద సంచలనం సృష్టించిది.
`ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో సైనికులు స్వర్ణ దేవాలయం లోకి వెళ్లాల్సివచ్చింది?
`అది సిక్కుల మనోభావాలను దెబ్బతీసింది.
`ఇందిరాగాంధీ అంగ రక్షకులే ఆమెను కాల్చి చంపారు.
`అనుకోని సమయంలో రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారు.
`తర్వాత జరిగిన ఎన్నికలలో 408 సీట్లతో కాంగ్రెస్ గెలిచింది.
`ప్రధాని రాజీవ్ గాంధీ శ్రీలంక కు సైనిక సహాయం చేశారు.
`‘‘ఎల్ టిటిఈ‘‘ కి అది నచ్చలేదు.
`అప్పటి నుంచి రాజీవ్ గాంధీ వాళ్లకు టార్గెట్ అయ్యారు.
`తమిళనాడు లోని పేరంభదూర్ ప్రచారంలో మానవ బాంబ్ పేలింది?
`ఆ దుర్గటనలో రాజీవ్ గాంధీ మరణించారు.
`అప్పటి నుంచి గాంధీ కుటుంబం కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉంది.
`తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితులోచ్చాయి.
`కాంగ్రెస్ నాయకులంతా సోనియా గాంధీ ని పార్టీ అధ్యక్షురాలు గా ఉండాలని కోరారు.
`అప్పుడు కూడా కాంగ్రెస్ ఆశా కిరణం ప్రియాంకే అనుకున్నారు.
`రాహుల్ గాంధీ రాజకీయాలలోకి తీసుకు రావడం సోనియా గాంధీ కి కూడా ఇష్టం లేదు.
`ఆ తరం లో ముగ్గురు చనిపోవడం సోనియా లో కలతను పెంచింది.
`పార్టీ భవిష్యత్తు దృష్ట్యా రాహుల్ రాక తప్పలేదు.
`ఇప్పుడు పార్టీ నిలబడాలంటే ప్రియాంక పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరుతున్నారు.
`పియాంక పార్టీని అధికారంలోకి తెచ్చి అన్నను ప్రధాని చేయడమే ఆమె లక్ష్యం.
హైదరాబాద్, నేటిధాత్రి:
కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్దాయిలో భవిష్యత్తు వాయినాడ్ ఎంపి. ప్రియాంక గాంధీ. ఇది ఇప్పుడు జాతీయ స్దాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో జరుగుతున్న ఆసక్తికరమైన చర్చ. రాహుల్ గాంధీ నిజానికి ఎంతో సమర్ధవంతమైన నాయకుడు. ఎంతో విజ్ఞానమున్న నేత. అంతర్జాతీయ స్ధాయి ఆర్దిక వ్యవస్ద మీద ఎంతో అవగాహన వున్న నాయకుడు. అంతర్జాతీయ రాజకీయాల మీద కూడా పట్టున్న నాయకుడు. కాని ఆయన విజ్ఞానం మన దేశానికి పనికి రావడం లేదు. కారణం ఆయనలో వాక్చాతుర్యం లేకపోవడమే? ప్రజలను ఒప్పించి, మెపించే బాష తెలియకపోవడమే. ప్రజలను ఆకట్టుకునేలా ఆయనకు పదాలు జలజల రాకపోవడమే. అవును. ఒక నాయకుడు మంచి వ్యాఖ్యత అయితేనే జనాన్ని మెప్పించగలడు. అవి నిజాలైనా కాని, అబద్దాలైనా కాని జనం నమ్మాలంటే జనాన్ని రంజింపజేసే విధంగా ఆయన మాట తీరు వుండాలి. కాని అది ఆయనకు పదిహేనేళ్లయినా రావడం లేదు. ఆయన చెప్పే మాటలు జనాలకు వెళ్లడం లేదు. బిజేపి నాయకుల మాటల ముందు ఆయన తేలిపోతున్నారు. బిజేపి చేస్తున్న విమర్శలకు ఆయన సరైన సమాదానం ఇవ్వలేకపోతున్నారు. అందుకే ఆయన రాజకీయాల్లో చాలా వెనుకబడి పోతున్నారు. ఆయన చెప్పే విషయాలు ఎంతో గొప్పగా వుంటాయి. ఆయన అంచనాలు ఎంతో దూరదృష్టిని కలిగి వుంటాయి. కాని ఆయన మాటలను బిజేపి పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదు. పైగా నాయకత్వ లక్షణాలు వున్నప్పటికీ ప్రతిపక్షాలను ఏకతాటిపై నడిపే శక్తి ఆయనకు లేదు. అంతే కాకుండా 2009లో ఆయన ప్రధాని కావాల్సిన నాయకుడు. కాని ఆయన ఆనాడు వదులుకోవడమే కాంగ్రెస్ పార్టీకి, ఆయన భవిష్యత్తు రాజకీయానికి శాపంగా పరిణమించింది. ఆనాడే ఆయన రాజకీయ జీవితం దారి తప్పింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ విదేశి పర్యటనలపై ఎవరూ నోరు మెదపరు. కాని రాహుల్ గాందీ విదేశాలకు వెళ్లడాన్ని బిజేపి వివాదం చేస్తుంది. అయినా దాన్ని రాహుల్ పట్టించుకోరు. విదేశాలలో రాహుల్ ఎంతో అద్యయనం కోసం వెళ్తుంటారు. అది చెప్పుకోరు. కాని బిజేపి చెప్పే మాటలను జనం నమ్ముతున్నారు. ప్రతిపక్ష నేతగావుంటూ ఆయన విదేశాలలో విలాసాలకు వెళ్తారని బిజేపి అంటే జనం నమ్ముతున్నారు. గతంలో ఏ ప్రధాని ఇలా విదేశీ పర్యటలకు వెళ్లలేదని ఏనాడు రాహుల్ గాందీ ప్రధాని మోడీని విమర్శించిన సందర్భాలు లేదు. దేశ దేశాలు తిరిగే ప్రదాని మోడీ కరోన సమయంలో ప్రపంచ దేశాలు జాగ్రత్తపడినంత తొందరగా చర్యలు తీసుకోలేదు. కాని అందరికంటే ముందుగానే రాహుల్ గాంధీ స్పందించారు. పెను ఉప ద్రవం వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. ఆ సమయంలో రాహుల్ వ్యాఖ్యలను బిజేపి ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా రాహుల్‌ను హేళన చేసిన సందర్భం వుంది. అలా రాహుల్ గాంధీ అన్ని విషయాల్లో తేలిపోతున్నారు. అందుకే ఇక కాంగ్రెస్ పార్టీ ఈ మూడు సంవత్సరాలలో పూర్వ వైభవం సంతరించుకోవాలంటే ప్రియాంక గాందీ పార్టీ పగ్గాలు చేపట్టడమే మేలన్న అభిప్రాయాలు అందరూ వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంక గాందీ అచ్చు ఇందిరాగాందీని పోలి వుంటారు. ఇందిరాగాందీలో కనిపించే స్పాంటినిటి ప్రియాంకలో మెండుగా వుంది. పార్లమెంటులో కాని, సభల్లో గాని, మీడియా ముందు గాని ఆమె వేసే చమక్కులు ఎంతో పవర్ పుల్గా వుంటాయి. ఓ వైపు ఎంతో సీరియస్‌నెస్‌ను చూపిస్తాయి. అంతే ఫన్నీగా వుంటాయి. ఇలా ఒక్క మాట అన్ని రకాల డైమెన్షన్లను చూపించే విధంగా ప్రియాంక పంచ్‌లు వేయడం ఇటీవల కాలంలో చాల చూస్తున్నాం. సాక్ష్యాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతోపాటు, బిజేపి నాయకులు ప్రియాంక గాందీ పంచుకులకు నివ్వెరపోతున్నారు. ఏ విషయంలోనైనా సరే ఆమె గుక్కతిప్పుకోకుండా మాట్లాడుతున్నారు. సబ్జెక్టును పర్ఫెక్టుగా వివరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కొన్ని విషయాలలో ఆమె నేరుగా ప్రదాని మోడీని సవాలు చేసేలా మాట్లాడుతూ వస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రదాని అయిన తర్వాత పార్లమెంటులో గాని, సభలలో గాని పదే పదే నెహ్రూ గురించి ప్రస్తావిస్తూ అనర్దాలన్నింటికీ కారణమంటూ చెబుతూవుంటారు. అది నరేంద్ర మోడీకి బాగా అలవాటైంది. జనానికి కూడా వినడానికి ఇంపుగా మారింది. దాంతో ప్రియాంక గాందీ ఒక్క మాటలో ప్రధాని మోడీ నోరు మూయించారు. పదే పదే నెహ్రూను ప్రస్తావిస్తూ మాట్లాడడం ఎందుకు? నెహ్రూ చేసిన తప్పులేమిటో వరుసగా ఒక లిస్టు రాసి చెప్పండి. దానిపై పార్లమెంటులో చర్చ చేపట్టండి. ఒక రోజా, రెండు రోజులా, పది రోజులా నిర్ణయం తీసుకోండి. ఎన్ని గంటలు చర్చిస్తారో చర్చించండి. ప్రజలకు తెలియజేయండి. తర్వాత ఇక వదిలేయండి. ఎంత సేపు నెహ్రూ కాలం గురించి ఎందుకు? మీరు ప్రధాని అయి పదకొండు సంవత్సరాలౌతోంది. వర్తమానం చెప్పండి. ఈ పదకొండేళ్లలో సాదించిన ప్రగతి చెప్పండి. ఇవ్వాల చంద్రయాన్ గురించి చెప్పుకుంటున్నారంటే అది నెహ్రూ పుణ్యమే అంటూ ఆమె నిండుపార్లమెంటులో చెప్పడంతో బిజేపి నాయకులనోర్లు మూతపడ్డాయి. నెహ్రూ పటేల్‌ను ప్రదాని కాకుండా అడ్డుకున్నారన్న విషయంలో కూడా ప్రియాంక చెప్పిన సమాధానం బిజేపి వాళ్లను ఇరుకున పెట్టింది. అంతే కాకుండా దేశమంతా బ్యాలెట్పద్దతిలో ఎన్నికలు పెట్టండనికోరుతోంది. బిజేపికి, కేంద్ర ప్రభుత్వానికి ధైర్యం వుంటే బ్యాలెట్ తో ఎన్నికలు రండి? అని సవాలు విసిరింది. బ్యాలెట్ పద్దతిన బిజేపి ఎన్నికలకు వస్తే ఒక్కసీటు కూడా గెల్చుకోలేదని తేల్చి చెప్పింది. ఇలా బిజేపిని ఇంత తక్కువ కాలంలో ఆమె నోరు మూయించే స్దాయికి చేరింది. నిజానికి రెండున్న దశాబ్దాల క్రితం వరకు రాజకీయాలలోకి ప్రియాంక వస్తుందని అందరూ అనుకున్నారు. రాహుల్ గాందీ రాజకీయాలకు సరిపోడని ఆనాడే అన్నారు. కాని అనుకోకుండా ప్రియాంక రాలేదు. రాహుల్ రాజకీయాలలోకి వచ్చారు. వచ్చిన అవకాశాలను ఆయన దూరం చేసుకున్నారు. అది ఆయన స్వయం కృతాపరధమే అవుతుంది. తనకు తానుగా తన నాయకత్వ పటిమను నిరూపించుకొని ప్రదాని అవుదామనుకున్నాడు. కాని మూడుసార్లు ఆయన అదికారానికి దూరమయ్యారు. పార్టీ అధ్యక్ష పదవి కూడా ఆయన వదులుకున్నారు. ఇప్పటికీ దేశంలో కాంగ్రెస్ అంటే గాందీకుటుంబమే దిక్కు. రాహుల్ గాందీ అటునాయకుడిగా పార్టీకి దిక్కుగా మారలేదు. పెళ్లి చేసుకోలేదు. దాంతో అటు కుటుంబ వారసత్వమైనా, ఇటు రాజకీయ వారసత్వమూ ఆయన వదులుకున్నట్లే లెక్క. రాహుల్ గాంధీ ప్రదాని కావాలంటే ప్రియాంకా గాందీ వల్లనే సాధ్యమౌతుంది. ప్రియాంకా గాందీ పార్టీ పగ్గాలు చేపడితేనే కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో బైట పడగలుగుతుంది. లేకుంటే పార్టీ పరిస్దితి మరింత దిగజారే అవకాశం వుంటుంది. ఇప్పటికే రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతుంది. వరుసగా బిజేపి పార్టీ అధికారంలోకి వస్తుంటే రాష్ట్రాలలో సమర్ధవంతమైన నాయకులు రావడం లేదు. ఏ రాజకీయ నాయకుడైనా ఎల్లకాలం ప్రతిఫక్షంలోనేవుండాలనుకోరు. ఇదే పరంపర కొనసాగితే కాంగ్రెస్‌నుంచి రాష్ట్ర నాయకులు బిజేపి దారి పట్టొచ్చు. అందువల్ల పార్టీకి జవసత్వాలు రావాలి. పార్టీకి పునరుజ్జీవం తెచ్చే నాయకత్వం కావాలి. ప్రియాంక తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ప్రియాంక రంగంలోకి దిగి తన కుటుంబం చేసిన త్యాగాలను ప్రజలకు వివరించాలి. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్య్రం కోసం ఎంత పోరాటం చేసిందో ఈ తరానికి తెలియజేయాలి. 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనతో జరిగిన అభివృద్ది చెప్పాలి. విద్యా, వైద్య రంగాలలో ఎలా పురోగతి సాదించారో చెప్పాలి. ఈ పదకొండేళ్లలో బిజేపి పాలనలో విద్యా వ్యవస్ద ఎలా కునారిల్లిందో చెప్పాలి. నిరుద్యోగ సమస్య ఎలా పెరిగిందో చెప్పాలి. చిన్న చిన్న వ్యాపారాలు ఎలా చిదిమేయబడ్డాయో చెప్పాలి. జిఎస్టీ వల్ల జనం ఎంత నష్టపోయారో ప్రియాంక చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ బ్యాంకులను జాతీయం చేస్తే బిజేపి ఎలా ప్రైవేటు పరం చేస్తుందో చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని ఎలా ఆదుకున్నారో చెప్పాలి. దేశంలో నెహ్రూ కాలంలోనే ఎన్ని బహులార్దక ప్రాజెక్టులు నిర్మాణం చేశారో చెప్పాలి. పదకొండేళ్లలో మోడీ ప్రభుత్వం నీటి పారుదల రంగాన్ని ఎలా నిర్లక్ష్యం చేసిందో చెప్పాలి. నోట్ల రద్దు నుంచి జనం ఎదుర్కొన్న సమస్యలు చెప్పాలి. ఓట్ చోరి ఒక్కటే పట్టుకుంటే సరిపోదు. బిజేపి ప్రకృతిని ఎలా విద్వంసం చేస్తుందో చెప్పాలి. అవన్నీ ప్రియాంక గాంధీ వల్లనే సాద్యమని కాంగ్రెస్ బలంగా నమ్ముతోంది.
