
తొర్రూర్ ( డివిజన్) నేటి ధాత్రి:
లింగ నిర్ధారణ చేయకూడదు
తొర్రూరు పట్టణం లోని స్కానింగ్ సెంటర్లు ఆసుపత్రు లు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని మాతా శిశు సంక్షేమ ప్రోగ్రాం అధికారి డాక్టర్ సారంగం అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆదేశాల మేరకు గురువారం పట్టణంలో ఆక స్మిక తనిఖీలు నిర్వహిం చామన్నారు. అనంతరం అయ న మాట్లాడు తూ ఆసుపత్రికి వచ్చిన వారి వివరాలు, స్కా నింగ్ నిర్వహించిన వారి వివ రాలు, పూర్తి ఇంటి పేరు, ఇంటి నేo, చిరునామా, ఖచ్చి తంగా నమోదు చేయాలన్నా రు.అ లాగే ప్రైవేట్ ఆసుపత్రుల వారు అందించే సేవలకు తీసు కునే రుసుమును ధరల పట్టిక రూపం లో అందరికీ కనిపించే విధముగా ఆసుపత్రి ఆవరణ లో ప్రదర్శించాలన్నారు.16 ఫామ్ –ఎఫ్ రికార్డులు సక్రమం గా ఉండాలని,ప్రతి నెల 5 వ తేదీ లోపల జిల్లా వైద్యఆరోగ్య శాఖ కార్యాలయంకు ఖచ్చితం గా పంపించాలని ఆయన పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితిలో లింగ నిర్ధారణ చేయకూడదని, ఎంటిపి నియమాలకు వ్యతి రేకంగా అబార్ష న్ లు చేయ కూడదని అలాగే సాధారణ ప్రసవాల రేటు పెంచాలన్నారు. ఆసుపత్రు లలో పిల్లల మరణా లు, మాతృ మరణాలు సంభ వించి నట్లైతే వివరాలను కార్యాలయంలో అందించాల న్నారు. ఆసుపత్రికి వచ్చిన వారికి సాదారణ ప్రసవం గూర్చి ముందు నుండే సలహాలు, కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. ఈ తనిఖీ లో ప్రోగ్రాం అధికారి డాక్ట ర్ సారంగం, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా ఆఫీసర్ ప్రసా ద్, అరుణ్ లు పాల్గొన్నారు