కలెక్షన్ ఏజెన్సీల పేరుతో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల దాడులు.

ఏజెన్సీల పేరుతో వేధింపులు

లారీ యజమానులపై ఫైనాన్స్ ఎజెంట్ల ఆగడాలు.

ప్రైవేట్ ఫైనాన్స్ పేరుతో రౌడీలను, గుండాలనూ ఏజెంట్లుగా పెట్టుకొని లారి లపై దాడులు.

ప్రైవేట్ ఫైనాన్స్ ల ఆగడాలు అరికట్టాలి,
లారీ యజమానులకు రక్షణ కల్పించాలి.

___వరంగల్ జిల్లా లారీ అసోసియేషన్ విన్నపం

వరంగల్ నేటిధాత్రి

వరంగల్ లారీ అసోసియేషన్ అధ్యక్షులు వేముల భూపాల్ ఆధ్వర్యంలో వరంగల్ లారీ అసోసియేషన్ కార్యాలయంలో ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల వేధింపుల గురించి ప్రెస్ మీట్ ఏర్పాటుచేసి మాట్లాడారు. ప్రైవేట్ కలెక్షన్ ఏజెన్సీలు తీసుకొని, ఏజెన్సీ నిర్వాహకులు రౌడీలను, గుండాలను కలెక్షన్ ఏజెంట్లుగా పెట్టుకొని ఫైనాన్స్ కలెక్షన్ పేరుతో లారీ యజమానులపై దాడులు నిర్వహిస్తూ, మమ్మల్ని భయభ్రాంతులను గురి చేస్తున్నారని తెలిపారు. బుధవారం రాత్రి ఎనుమాముల 100 ఫీట్ రోడ్డు వెళ్లే దారిలో ఒక లారీని ఆపి, ఫైనాన్స్ కట్టాలని బెదిరింపులు గురిచేసి డ్రైవర్ దగ్గర ఉన్న డబ్బులు లాక్కొని, డ్రైవర్ పైకే లారీని ఎక్కించినట్లు తెలిపారు. నిన్న రాత్రి జరిగిన ఘటన జరిగిన విషయం సంఘటన సమాచారం తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకునే సరికి ఫైనాన్స్ సంస్థలకు చెందిన కలెక్షన్ ఏజెంట్లు లారీని బలవంతంగా ఆపీ లారీని తీసుకెళ్లే క్రమంలో, లారీని యూపీకి చెందిన డ్రైవర్ కాలు పైకి వెళ్లగా, కాలు విరిగి తీవ్ర అస్వస్థతకు గురై, కిందపడి ఉన్న డ్రైవర్ని వెంటనే తోటి లారీ యజమానులు స్థానిక గార్డెన్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించినట్లు తెలిపారు. అనంతరం జరిగిన సంఘటనపై స్థానిక ఏనుమాముల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. నిరుపేద కుటుంబాలకు చెందిన లారీ యజమానులను ఫైనాన్స్ సంస్థలు ఏజెన్సీల పేరుతో వారు చేసే దాడులను అరికట్టాలి అని, కలెక్షన్ పేరుతో దాడులు చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ను వారు వేడుకున్నారు. గాయపడిన డ్రైవర్ కు న్యాయం చేయాలని ఈ కార్యక్రమంలో
ది వరంగల్ జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ కోశాధికారి వేముల భూపాల్, చైర్మన్ ఎండి ఖాజా పాషా, వైస్ ప్రెసిడెంట్లు ఎండి లాల్ హైహ్మద్, ఎండి యా, శ్రీనివాస్ నాయుడు, సురేష్ నాయుడు, జయరాం రోడ్ లైన్స్, శ్రీమాతా లారీ ట్రాన్స్పోర్ట్ సురేందర్, వెంకన్న, ఇతర లారీ యజమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!