> నవాబుపేట మండలంలో ఆర్ఎంపి డాక్టర్ల నిర్లక్ష్యం.
> మొన్న పోమాలలో….
నిన్న యన్మన్ గండ్లలో
రోగుల మృతి.
> నవాబుపేట మండలంలో ఆర్ఎంపీ డాక్టర్ల నిర్లక్ష్యం.
> హెవీడోస్ కారణంగా 32 ఏండ్ల యువకుడు వృత్తి.
> ఇప్పటికే ఆరు మంది మరణానికి కారణమైన ఆర్ఎంపి.అమర్ సింగ్.
> డబ్బులు ఇచ్చి దందా చేస్తున్న ఆర్.ఎం.పి.
> డబ్బుల డీలింగుల్లో మెడికల్ షాప్ ల యజమాన్యం.
> ఆరు మంది మరణానికి కారణమైన ఆర్ఎంపి పై చర్యలే లేవు.
మహబూబ్ నగర్ జిల్లా ;నేటి ధాత్రి
వైద్యుని నిర్లక్ష్యంతో ఓ యువకుని ప్రాణం బలైన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. నవాబుపేట మండలం యన్మన్ గండ్ల గ్రామానికి చెందిన కొన్నింటి విష్ణు 27/09/2023 రోజు వ్యవసాయ పొలం నుండి ఇంటికి వచ్చిన విష్ణు , నీరసంగా ఉండటంతో వైద్యం కోసం నవాబుపేట మండల కేంద్రంలో గల ఆర్ఎంపీ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న, బాలానగర్ మండలానికి చెందిన,డాక్టర్ అమర్ సింగ్, దగ్గరకు వెళ్ళరు , డాక్టర్ అమర్ సింగ్ నీరసంగా ఉన్నా వ్యక్తికి ఇంజక్షన్ ఇచ్చారు, అలాగే కొన్ని మందులు కూడా ఇచ్చి డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళమని చెప్పాడు, కానీ ఇంటికి వెళ్లిన విష్ణు కళ్ళు తిరిగి కిందపడిపోవడంతో మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లాగా, డాక్టర్ పరిశీలించి ముందుగానే మరణించడని తేల్చి చెప్పడంతో తిరిగి నవాబు పేట మండల కేంద్రంలోని అమర్ సింగ్ క్లినిక్ దగ్గరకు మరణించిన వ్యక్తిని తీసుకొని వెళ్లారు. ఇట్టి విషయం ముందుగానే తెలుసుకున్న డాక్టర్ అమర్ సింగ్ క్లినిక్ మూసి పరారయ్యాడు. క్లినిక్ దగ్గర మరణించిన వారి కుటుంబ సభ్యులు దిగవ్వాదానికి దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. విష్ణు చావుకు కారణమైన డాక్టర్ అమర్ సింగ్ నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు ప్రాణం బలైందని యన్మన్ గండ్ల గ్రామస్తులు పోలీసు వారికి చెప్పడంతో పోలీసు వారు పక్కనే మెడికల్ షాపు నిర్వహిస్తున్న సిద్దును పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించగా, సిద్దు ఫోన్ ద్వారాడాక్టర్ అమర్ సింగ్ ను సంప్రదించారు.చనిపోయిన వ్యక్తికి పారితోషికంగా 14 లక్షలు ఇస్తానని డాక్టర్ అమర్ సింగ్ సిద్దుకు ఫోన్ ద్వారా తెలిపారు. మరణించిన వ్యక్తికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.నవాబుపేట మండల కేంద్రంలో క్లినిక్ నిర్వహిస్తున్న ఆర్.ఎం.పి,డాక్టర్ అమర్ సింగ్ ఇలా ఎంతమంది ప్రజల ప్రాణులతో చెలగాటమాడుతాడని చుట్టుపక్కల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.