
ములుగు టౌన్
మలుగు టౌన్ నేటి ధాత్రి
పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ఎంతో కొంత నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్య అందించాలని ఆలోచనతో ఆయా కుటుంబాలు తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివించుకునే క్రమంలో అదే అదునుగా ప్రైవేటు విద్యా సంస్థలు పుస్తకాలు,బట్టలు, టై,బెల్టు లాంటి విద్యార్థులకు సంబంధించిన వస్తువులతో వేలకు వేల రూపాయల ధరలు పెడుతూ విద్యను వ్యాపారం చేస్తున్నాయని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డివైఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి రవి లు ఆరోపించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్ సర్వే లో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలోని బిట్స్ ప్రైవేట్ పాఠశాలలో కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో విద్యార్థుల పుస్తకాలు యూనిఫామ్ బట్టలు అమ్ముతు విద్యను వ్యాపారం చేస్తున్నారని పేద మధ్యతరగతి కుటుంబాలు కొనే పరిస్థితి లేకుండా (1 వ తరగతి కి 4 నుండి 5 వెలు పుస్తకాలకి ,1000 నుండి 1500 యూనిఫాం టై బెల్ట్ కు). వేలకు వేలు ధరల కు అమ్ముతూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తూ విద్య రంగాన్ని విద్యాలయాలను వ్యాపార కేంద్రాలుగా వ్యాపార సంస్థలుగా మార్చివేస్తున్నాయని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం పుస్తకాలు యూనిఫామ్స్ ఇతర విద్యార్థులకు సంబంధించిన వస్తువులు ఏవి అమ్మకూడదని నిబంధనను జారీ చేసిన గాని ములుగు కేంద్రంలో ఉన్న బిట్స్ పాఠశాల ఆయా నిబంధనలను పాటించకుండా ప్రభుత్వ నియబంధనలను (ఫీజు స్ట్రక్చర్ బోర్డు ఏర్పాటు )తుంగలో తొక్కుతూ ఇష్టారాజ్యంగా విద్య వ్యాపారం చేస్తున్నాయని ఈ విధమైన పుస్తకాల వ్యాపారం చేస్తూ తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నారని జిల్లా విద్యాశాఖ అధికారి గారికి దృష్టికి తీసుకుపోయినప్పటికీ డీఈవో కూడా స్పందించకుండా ఆయా పాఠశాలతో కుమ్మక్కయి కనీసం స్పందించడం లేదని వారు తెలియజేశారు వెంటనే ప్రభుత్వం స్పందించి ఆయా పాఠశాలను సిజ్ చేయాలని విద్యాశాఖ అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడం జరుగుతోంది ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు విజయ్ శివ రాకేష్ సాయి కిషోర్ డివైఎఫ్ఐ నాయకులు దేవేందర్ సద్దాం రంజిత్ తదితరులు పాల్గొన్నారు