రేజింతల్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు .సఫీయ సుల్తానా ఆధ్వర్యంలో నో బ్యాగ్ డే ఘనంగా నిర్వహించారు..
జహీరాబాద్. నేటి ధాత్రి:
న్యాల్ కల్ మండలంలోని ప్రాథమిక పాఠశాల రేజింతల్ లో నో బ్యాగ్ డే ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో విద్యాశాఖ జిల్లా అధికారులు సి ఎం ఒ – వెంకటేశం ఏ ఎం ఒ – అనురాధ జి సి డి ఒ – సుప్రియ

జిల్లా సైన్స్ అధికారి సిధారెడ్డి ఏం ఈ ఒ మారుతి రాథోడ్
ప్రధానోపాద్యాయురాలు సఫీయ సుల్తానా. ఛైర్మన్ రామేశ్వరి ఎంపీటీసీ మల్లిక విద్యార్థుల తల్లిదండ్రులు మండలంలోని ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఫైన్ మోటార్ స్కిల్స్,గ్రాస్ మోటార్ స్కిల్స్, బ్రెయిన్ జిమ్ ఎక్సర్సైజ్, బైలాటరల్ యాక్టివిటీస్, స్పాన్ ఆఫ్ అటెన్షన్ కి సంబంధించిన యాక్టివిటీస్ 100 కి పైగా ప్రదర్శనలను నిర్వహించారు. అలాగే నో బ్యాగ్ డే లో భాగంగా పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన అందరికీ ఆకట్టుకుంది.ప్రతి సంవత్సరం సైన్స్ ఫెయిర్ గత 5 సంవత్సరాల నుండి పాఠశాలలో నిర్వహిస్తున్నారు.ఈ సారి వినూత్నంగా నో బ్యాగ్ డే నిర్వహించడం పట్ల జిల్లా అధికారులు హర్షం వ్యక్తంచేశారు. అలాగే జిల్లా విద్యా శాఖ తరపున పాఠశాల ప్రధానోపాధ్యాయులు .సఫీయ సుల్తానా గారిని జిల్లా అధికారులు శాలువా పూలమాలలతో సన్మానించడం జరిగింది.