· చిన్నప్పటినుంచే ఆరఎసఎస్‌తో అనుబంధం
· టీ స్టాల్లో తండ్రికి సహాయం
· బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగిన నేత
· దేశంలో అత్యధిక కాలం పదవిలో కొనసాగిన రెండవ నేతగా రికార్డు
· 370 అధికరణం రద్దు వంటి సాహసోపేత నిర్ణయాలు
· అయోధ్య రామమందిర నిర్మాణ కల సాకారం
· త్రిపుల్ తలాక్ బిల్లుతో ముస్లిం మహిళలకు రక్షణ
· జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటింపజేసిన ఘనత
· ఫలితాలు చూపుతూ కొనసాగుతున్న సమర్థ పాలన
· అగ్రరాజ్యాలను అనువుగా మార్చుకున్న ఘనత
హైదరాబాద్, నేటిధాత్రి:
నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రస్తుతం మనదేశానికి 14వ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2014 నుంచి ప్రధానిగా కొనసాగుతున్న ఆయన గతంలో 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన రాష్ట్రీయ స్వయం స్వయంసేవక్‌గా తన కెరీర్‌ను ప్రారంభిం చిన ఆయన, దేశానికి అత్యధికకాలం పనిచేసిన కాంగ్రెస్సేతర ప్రధానిగా రికార్డు సష్టించారు. మోదీ ఉమ్మడి ముంబయి రాష్ట్రంలోని వడ్నానగర్ (ప్రస్తుతం గుజరాత్)లో 1950లో జన్మించారు.తండ్రిపేరు దామోదర్ దాస్ ముల్చంద్ మోదీ, తల్లి హీరాబెన్ మోదీ. వీరి ఆరుగురి సంతానం లో మోదీ మూడవ వారు. వడ్నాగర్ రైల్వేస్టేషన్లో మోదీ తండ్రి టీ స్టాల్ నడిపేవారు. చిన్న వయ స్సులోనే తండ్రికి టీ అమ్మకాల్లో సహాయంగా పనిచేశారు. ఇది ఆయన కష్టపడే మనస్తత్వా న్ని సూచిస్తుంది. 1967లో నరేంద్ర మోదీ వడ్నాగర్లో ఉన్నత మాధ్యమిక విద్యను పూర్తిచేశా రు. చదువుకునే రోజుల్లో నాటకాలపై ఆసక్తి ప్రదర్శించే వారు. వక్తత్వ పోటీల్లో చురుగ్గా పాý£్గనేవారు. 1978లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా పొందారు. 1983లో గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. తనకు ఎనిమిదేళ్ల వయసులోనే ఆరఎసఎస్‌తో పరిచయం ఏర్పడింది. లక్ష్మణరావు ఇనామ్దార్ ఆయన్ను బాల స్వ యం సేవక్‌గా చేర్చుకున్నారు. తర్వాత ఆయనే రాజకీయ గురువు అయ్యారు. 1971లో గుజరాత్లో ఆయన ఆరఎసఎస్ లో పూర్తికాల కార్యకర్తగా చేరారు. యుక్తవయస్సులో ఎన్సీసీలో పనిచేశారు. 1985లో ఆరఎసఎస్ ఆయన్ను బీజేపీకి కేటాయించింది. ఆయన పార్టీలో అంచెలంచె లుగా ఎదిగి 1998 నాటికి ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1990లో అద్వానీ రథయాత్ర, 1991`92లో మురళీమనోహర్ జోషి ‘ఏక్తా యాత్ర’ల నిర్వహణలో సహాయపడ్డారు. 1995లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపులో కీలకపాత్ర పోషించారు. అదే ఏడాది ఆయన ఢిల్లీకి బదిలీ అయ్యారు. అక్కడ హర్యానా, హిమాచల్ ప్రదేశ్లలో పార్టీకి బాధ్యత వహించారు. 1998లో గుజరాత్లో బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధించి అధికారంలోకి రావడంలో కీలక పా త్ర పోషించి అందరి ప్రశంసలు అందుకున్నారు. అదే ఏడాది బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పదో న్నతి పొందారు. 2001లో భుజ్‌లో భూకంపం సంభవించినప్పుడు ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ పనితీరు విమర్శలకు గురికావడం, దీనికి తోడు ఆయన ఆరోగ్యం క్షీణించడంతో న¹ంంద్ర మోదీని ముఖ్యమంత్రిగా నియమించారు. 2002 ఫిబ్రవరి 27న గోధ్రా సమీపంలో కరసేవకులున్న రైలు బోగీలను కొందరు మతోన్మాదులు దగ్ధం చేయడంతో 60కి పైగా సజీవదహన మయ్యారు. దీంతో గోద్రాలో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లకు మోదీని బాధ్యుడిని చేసి ఏదోవిధంగా జైలుకు పంపాలని నాటి యూపీఏ ప్రభుత్వం చేసిన యత్నాలేవీ ఫలించలేదు. చివరకు సుప్రీంకోర్డు కూడా ఆయన నిర్దోషిగా స్పష్టం చేయడంతో కడిగిన ముత్యంలా బయటపడ్డారు.
ఆయన గుజరాత్‌కు నాలుగు టర్మ్‌లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. గుజరాత్లో ఆయన చేపట్టినఅభివద్ధి పనులు అందరి ప్రశంసలు అందుకున్నాయి. ఇవ్వాళ దేశవ్యాప్తంగా అభివద్ధి అంటే గుజరాత్ నమూనా అనేది ఒక బ్రాండ్‌గా మారిపోయింది. 2014, 2019, 2024 సంవత్సల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని విజయపథంలో నడిపించారు. “సబ్ కా సాథ్, సబ్కా వికాస” నినాదంతో అభివద్ధి జాతీయ భద్రత, సామాజిక, సంక్షేమ కార్యక్రమాలపై దష్టి కేంద్రీకరించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జన్మించిన తొలి ప్రధాని నరేంద్ర మోదీ కావడం విశేషం. మోదీ జీవితంపై స్వామి వివేకాంద ప్రభావం బలీయంగా వుండటం గమనార్హం.
1984 తర్వాత 2014లో మొట్టమొదటిసారి ఒక పార్టీకి పూర్తి మెజారిటీ లభించింది. ఈ మ ధ్యకాలంలో సంకీర్ణ ప్రభుత్వాలు పాలించాయి. అందువల్ల 1984‘2014 మధ్యకాలాన్ని మనదేశ చరిత్రలో “సంకీర్ణ ప్రభుత్వాల శకం”గా పరిగణిస్తారు. మోదీ ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పె ట్టుబడులను బాగా పెంచింది. యూపీఐ చెల్లింపులు, డిజిటల్ ఇండియా ద్వారా గ్రామీణ ప్రాం తాలకు కూడా ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఆయుష్మాన్ భారత్, పీఎం ¿ ìసాన్, ఉజ్వల యోజన వంటి పథకాలను ప్రవేశపెట్టారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, కొత్త హైవేలు, విమానాశ్రయాల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఐక్యరాజ్య సమితి ద్వారా జూన్ 21ని అంతర్జాతీయ యోగా సంవత్సరంగా గుర్తించడంలో కీలక పాత్ర పోషించారు. ఎర్రబుగ్గ కార్ల చిహ్నాలను తొలగించి, “వీవీఐపీ సంస్కతిని88 రద్దు చేశారు. లబ్దిదారులకు నేరుగా బ్యాం కు ఖాతాల్లో జమయ్యేలా చేసి మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించి, పారదర్శకత పెంచారు. హిం దూ సాంస్కతిక వాదాన్ని రాజకీయాల్లో ప్రధాన స్రవంతిలోకి తెచ్చారు. 370 ఆర్టికిల్ రద్దు ద్వారా జమ్ముకశ్మీర్ స్వతంత్రప్రతిపత్తి రద్దు వంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో వున్న తటస్థ విధానం నుంచి భారత దేశాన్ని అంతర్జాతీయ యవనికపై ఒక కీలక స్థానంలో నిలిపేలా ఆయన విధానం కొనసాగింది. దశాబ్దాలుగా నలుగుతున్న రామజన్మభూమి వివాదం సు ప్రీంకోర్టు తీర్పుతో ముగిసిన తర్వాత మోదీ ప్రభుత్వం “శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర” ట్రస్టును నియమించింది. 2024, జనవరి 22న మోదీ చేతుల మీదుగా రామాలయ ప్రాణప్రతిష్ట జరిగింది. ఇది భారత సాంస్కతిక చరిత్రలో ఒక మైలురాయి. ముస్లిం మహిళలకు రక్షణ కల్పిస్తూ “త్రిపుల్ తలాక” చట్టాన్ని 2019లో అమల్లోకి తెచ్చారు. పరోక్ష పన్నులను రద్దుచేసి దేశవ్యాప్తం గా ఒకే పన్ను జీఎస్టీని అమల్లోకి తెచ్చారు. నల్లధనం, దొంగనోట్ల నిర్మూలనకోసం రూ.500, రూ.1000 నోట్లను ఏకంగా రద్దుచేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇది దేశాన్ని డిజిటల్ చెల్లింపుల వైపు మరల్చడానికి దోహదం చేసింది. సర్జికల్ స్ట్రెíక్స్‌తో ఉగ్రవాదంపై భారత్ తన విధానాన్ని మార్చుకున్నదన్న సంగతిని స్పష్టంగా తెలియజెప్పారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లలో మతపరమైన వేధింపులకు గురై భారత్‌కు వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ద, క్రిస్టియన్, జైన్, పార్సీ మతస్థులకు పౌరసత్వం కలిగించే సీఏఏ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించే చారిత్రాత్మక బిల్లును 2023లో అమల్లోకి తెచ్చారు. దీన్నే నారీశక్తివందన్ అధినియంగా వ్యవహరిస్తున్నారు.
నరేంద్రమోదీ రచయిత కూడా. పిల్లల కోసం “ఎగ్జామ్ వారియర్స” అనే పుస్తకాన్ని రాశారు. సోషల్ మీడియాలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఫాలోవర్లు ఉన్న నాయకుల్లో ఆయన ఒకరు.
నరేంద్ర మోదీకి ఇప్పటి వరకు వివిధ దేశాలనుంచి 29 కంటే ఎక్కువ పురస్కారాలు లభించాయి. చరిత్రలో అత్యధిక పురస్కారాలు సంపాదించిన భారతీయ నాయకుడిగా ఆయన రికార్డు స ష్టించారు. వీటితో పాటు ఐక్యరాజ్య సమితి నుంచి ‘ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త’ (2018) అవార్డును కూడా అందుకున్నారు. ఈ అంతర్జాతీయ అవార్డులు కేవలం వ్యక్తిగతమైనవి కావు. ఇవి మనదేశానికి, ఆయా దేశాలకు మధ్య వున్న బలమైన సంబంధాలకు ప్రతీకలు. ప్రపంచ వేదికపై భారత్ ఒక శక్తివంతమైన దేశంగా ఎదుగుతున్నదని ఈ అవార్డులు నిరూపిస్తున్నాయి. సౌదీ అరేబియా, యూఏఈ, పాలస్తీనా వంటి ముస్లిం దేశాలు తమ దేశ అత్యున్నత పురస్కారాలను ప్రదా నం చేయడం ద్వారా మనదేశంతో వున్న మైత్రిని చాటాయి. రష్యా, ఫ్రాన్స్, అమెరికా వంటి దే శాలు ఆయన నాయకత్వాన్ని గుర్తించడం ప్రపంచ శాంతిలో భారత్ పాత్రను ప్రతిబింబిస్తుంది. ఆయనకు పలు విదేశీ విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్, టైమ్ మ్యాగజైన్లు పలుమార్లు ఆయన్ను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరిగా గుర్తించాయి. 2014లో ప్రధానిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటివరకు ఆయన 99 విదేశీ పర్యటనలు జరిపి 79 దేశాలను సందర్శించారు. ఆయన విదేశీ పర్యటనలు కేవలం దౌత్య సంబంధాలకే కాకుండా రక్షణ, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో భారత్ యొక్క గ్లోబల్ ఇమేజ్ను పెంచడానికి దోహదం చేస్తున్నాయి.
మార్చి 30 నాటికి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా అత్యధిక కాలం నాయకత్వం వహించిన తొలి భారతీయుడిగా రికార్డు సష్టించారు. ఆయన అప్పటివరకు 8932 రోజులు పదవిలో కొనసాగారు. అంతకు ముందు సిక్కిం ముఖ్యమంత్రిగా (1994`2019) పవన్ కుమార్చామ్లింగ్ 8930 రోజులు, నవీన్ పట్నాయక్ (2000`2024) ఒడిశా ముఖ్యమంత్రిగా 8848 రోజులు, జ్యోతిబసు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా (1977`2000) 8234 రోజులు పద వుల్లో కొనసాగారు. ప్రధానమంత్రిగా అత్యధిక కాలం పనిచేసిన జాబితాలో మోదీ రెండో స్థానంలో వున్నారు. జవహల్‌లాల్ నెహ్రూ 16 సంవత్సరాల 286రోజులు (6130) రోజులు ప్రధాని గానిగా పనిచేశారు. ఆయనే ఇప్పటివరకు మనదేశానికి ప్రధానిగా ఎక్కువ కాలం కొనసాగారు. 2025 జులై 25న ప్రధానిగా ఇందిరాగాంధీ రికార్డును అధిగమించి మోదీ రెండో స్థానానికి ఎదిగారు. ఇందిరాగాంధీ ఒకే విడతలో 11ఏళ్ల 59 రోజులు ప్రధాని పదవిలో వున్నారు. వరుసగా మూడుసార్లు ఎన్నికై అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన తొలి కాంగ్రెస్సేతర నాయకుడిగా రికార్డు సష్టించారు. 2001నుంచి నేటి వరకు ఒక్కరోజు కూడా విరామం లేకుండా ప్రభుత్వాధినేత గా పనిచేస్తున్న ఏకైక నాయకుడు. రాష్ట్ర మరియు కేంద్ర స్థాయిలో పార్టీని ఆరుసార్లు విజయ| Ÿథంలో నడిపించిన ఘనత ఆయనది.
మొత్తంమీద చెప్పాలంటే 2047 నాటికి అభివద్ధి చెందిన దేశంగా భారత్‌ను మలచాలన్న లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ప్రణాళికలు రచించి అమలు చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వున్న భారత్ త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందనుందన్న అంచనాలున్నాయి.
