వనపర్తి నేటిధాత్రి :
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా లబ్ధిదారుని ఇంటికి చేరిటట్లు చేశారని పట్టణ బిజెపి అధ్యక్షులు బచ్చు రాం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ ఓపెన్ చేస్తే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉంటాయని వాటిని దరఖాస్తు చేసుకోవచ్చని ప్రజలను కోరారు 88 00 0 0 20 24 ఫోన్ కు మిస్సేడ్ కాల్ ఇవ్వాలని మెసేజ్ లో లింక్ ఓపెన్ చేసి మీ వివరాలు పెట్టాలని కోరారు. దేశంలో 18 కులాల చేతివృత్తుల వారికి ప్రధాని నరేంద్ర మోడీ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని తెలిపారు వనపర్తి లో 4000 వేల విశ్వకర్మ కుటుంబాలకు బిజెపి సభ్యత్వం చేయించామని ఆయన తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లా బిజెపి మహిళా ఉపాధ్యక్షురాలు మాజీ కౌన్సిలర్ ఏర్పుల సుమిత్రమ్మ మహిళా నేతలు కవిత కల్పన సర్పంచ్ దేవేందర్ నాయుడు కిసాన్ మోర్చా జిల్లా నాయకుడు ఏర్పుల జ్ఞానేశ్వర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు