
Medical Health Centre
*ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి భూమి పూజ
నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు*
◆ తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,
◆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
బర్దిపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు.దామోదర రాజనర్సింహ గారి కృషితో మంజూరైన ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి శుక్రవారం దత్తగిరి మహారాజ్ గారితో కలిసి తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు.ముందుగా బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమంలో వేద పండితులు పూర్ణకుంభంతో వేద మంత్రాలతో ఘన స్వాగతం పలికారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈకార్యక్రమంలో ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హన్మంతరావు పాటిల్,సిడిసి చైర్మన్ ముబీన్, జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్,మాజీ సోసైటి చైర్మన్,మల్లికార్జున్ రెడ్డి,మల్లన్న పాటిల్,మొగడం పల్లీ మాజీ యం.పి.పి.గుండారెడ్డి,నర్సింహారెడ్డియూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పి.నాగిరెడ్డి,అశ్విన్ పాటిల్,శ్రీకాంత్ రెడ్డి,హర్షవర్ధన్ రెడ్డి,జగదీశ్వర్ రెడ్డి,అక్షయ్ జాడే,సిడిసి డైరెక్టర్ మల్లారెడ్డి,గ్రామ మాజీ సర్పంచ్ వేణుగోపాల్ రెడ్డి,హర్షద్ పటేల్,నర్సింహా యాదవ్,అక్బర్,జుబేర్,ఇమామ్ పటేల్ మరియు వైద్య సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.