బీసీ రిజర్వేషన్ లకు మూల పురుషుడు బిపి మండల్!!
గొర్రె కాపరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలుక రాజు!!
ఎండపల్లి నేటి ధాత్రి
గత ప్రభుత్వాలు బిపి మండల్ చరిత్రను విస్మరించాయనీ,
బీసీ రిజర్వేషన్ లకు మూల పురుషుడు బిపి మండల్ అని
గొర్రె కాపరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలుక రాజు అన్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలో గొర్రె కాపరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఎలుక రాజు ఆధ్వర్యంలో బీపీ మండల్ 42 వ వర్ధంతి మరియు గొర్రె కాపర్ల సంక్షేమ సంఘం నాలుగో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీపీ మండల్ విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎలుక రాజు మాట్లాడుతూ నేడు భారతదేశంలో అమలవుతున్న బీసీ రిజర్వేషన్లకు మూల పురుషుడు బిపి మండల్ కానీ అతని చరిత్రను గత ప్రభుత్వాలు విస్మరించడం జరిగింది. రానున్న రోజుల్లో బీపీ మండల గారి చరిత్రను వెలికి తీసి ప్రతి మండల కేంద్రంలో బీపీ మండల గారి విగ్రహం ఏర్పాటు చేసే విధంగా తన వంతు కృషి చేస్తానని తెలపడం జరిగింది. ఈరోజు బీపీ మండల్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు ఎందుకనగా ఒక యాదవ బిడ్డగా బీపీ మండల్ యాదవ కులంలో జన్మించి కేంద్ర స్థాయిలో ప్రభుత్వంపై పోరాటం చేసే స్థాయికి ఎదిగి కొంత మేరకు బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయం లో సఫలీకృతమయ్యాడని మరియు అతను ఆనాడు 40 సిఫార్సులతో కూడిన ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. అందులో కొన్ని మాత్రమే ఇప్పుడు అమలవుతున్నాయి పూర్తిస్థాయిలో అమలు చేసే విధంగా నేడు ఉన్న మా సమాజం అతని ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని రానున్న రోజుల్లో అతని సిఫార్సులు అమలు చేసే విధంగా ప్రభుత్వ పెద్దలతో చర్చించి అమలు దిశగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు పలుమారు మల్లేష్ యాదవ్ ఉపాధ్యక్షులు లచ్చన్న తొట్ల లక్ష్మీరాజం జక్కుల తిరుపతి అనిల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు